కేవలం ఒకే ఒక్క `వింక్`తో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ కు సోషల్ మీడియాలో రోజురోజుకీ విపరీతమైన ఫాలోయింగ్ వస్తోంది. తాజాగా, ఈ టీనేజ్ బ్యూటీ....మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను వెనక్కు నెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో దుల్కర్ కన్నా ఎక్కువ మంది ప్రియాను ఫాలో అవడం విశేషం. అయితే, ఇంత గుర్తింపు వచ్చినప్పటికీ ఈ అమ్మడుకు సొంత సిమ్ కార్డు లేదట. ఆమెకు స్మార్ట్ ఫోన్ ఉంది కానీ, దానిని పరిమిత సమయంలోనే వాడాలట. ఇదేవిషయాన్ని సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తోన్న ప్రియా తండ్రి ప్రకాశ్ ...ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. ప్రియా దగ్గర వన్ ప్లస్ ఫోన్ ఉంది కానీ అందులో సిమ్ కార్డు లేదని ఆయన చెప్పారు.
ప్రియా చదివే కాలేజీలో పద్ధతిగా ఉండే దుస్తులు వేసుకోవాలని - మొబైల్స్ తీసుకెళ్లకూడదనే నిబంధనలున్నాయని చెప్పారు. ప్రియా వాళ్ల అమ్మ ఫోన్ లోనే తన స్నేహితులతో మాట్లాడుతుందన్నారు. ఇంట్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఉన్న సమయంలో తన ఫోన్ లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుందని చెప్పారు. ప్రియాకు సొంత సిమ్ వేసుకొని ఫోన్ వాడేందుకు తామింకా అనుమతినివ్వలేదన్నారు. ప్రియా `వింక్` సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు తన కొలీగ్ ఆ వీడియో క్లిప్ చూపించారని చెప్పారు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా అని తనను అడిగారని - ఆమె తన కూతురని చెప్పడంతో ఆ కొలీగ్ కు కొద్ది సేపటి వరకు నోట మాటరాలేదని చెప్పారు. ప్రియాను కూడా అందరిలాగే సాధారణ అమ్మాయిలా పెంచామని, అయితే, ఆమెకు కొన్ని ఆశయాలు, లక్ష్యాలు, అభిరుచులు ఉన్నాయని ప్రకాశ్ అన్నారు. ఆమెకు సంగీతం - డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.
’