గత ఏడాది సోషల్ మీడియా సెన్షేషన్ గా నిలిచిన ప్రియా వారియర్ నటించిన సినిమా అవ్వడంతో 'ఒరు ఆదార్ లవ్' మూవీ చిత్రానికి తెలుగు, తమిళంలో భారీ క్రేజ్ ఏర్పడింది. మలయాళంతో పాటు తమిళం మరియు తెలుగులో భారీ ఎత్తున ప్రమోషన్ చేసి మరీ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని 'లవర్స్ డే' టైటిల్ తో విడుదల చేయడం జరిగింది. అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా సినిమా ఫ్లాప్ అయ్యింది. అత్యంత దారుణమైన పరాజయం పాలవ్వడంతో పాటు సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా క్లైమాక్స్ మరీ చెత్తగా ఉందని, హీరో చనిపోవడం, హీరోయిన్ ను రేప్ చేయడం ఏంటీ అంటూ సాదారణ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు క్లైమాక్స్ ను మార్చేందుకు నిర్ణయించుకున్నారు. క్లైమాక్స్ మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. రేపటి నుండి క్లైమాక్స్ కొత్త వర్షన్ తో 'ఒరు ఆదార్ లవ్' మూవీ రాబోతుంది. కేవలం మలయాళంతోనే కాకుండా తమిళం మరియు తెలుగులో కూడా క్లైమాక్స్ మార్చబోతున్నారు.
ఫ్లాప్ అయిన మూవీస్ కు రీ ఎడిట్ చేయడం, క్లైమాక్స్ లు మార్చడం చేస్తూ ఉంటారు. అలా మార్చిన సినిమాలు పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు. అయినా కూడా ఆ పాత పద్దతిని ఇప్పటికి కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. ఎన్నో సినిమాలకు రీ ఎడిట్ చేసినా కూడా ఫలితం మాత్రం మారలేదు. అంత తెలిసినా, అన్ని తెలిసినా కూడా ఈ చిత్రాన్ని రీ ఎడిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. క్లైమాక్స్ ను మార్చడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.