ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పెళ్లిచూపులు. సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ హిట్ అయిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అందుకే, ఈ సినిమాకు నేషనల్ అవార్డు లభించింది. ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కు ఉత్తమ స్క్రీన ప్లే అవార్డు దక్కింది. ఆ సినిమా హిట్ లో సగం క్రెడిట్ కౌశిక్ పాత్ర పోషించిన ప్రియదర్శి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. నా సావు నేన్ జస్తా...నీకెందుకు....అంటూ తన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో ప్రియదర్శి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ సినిమాలో ప్రియదర్శి పండించిన హాస్యానికి గానూ అతడికి ఐఫా ఉత్తమ కమెడియన్ అవార్డు లభించింది.
`పెళ్లిచూపులు` చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు ప్రియదర్శి పాత్ర పెద్ద హైలైట్ కావడంతో తమిళంలో కూడా ఆ పాత్రను ప్రియదర్శితోనే చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమా తమిళ రీమేక్ `పొన్ ఒండ్రు కాందేన్`లో కూడా కౌశిక్ పాత్రను ప్రియదర్శి పోషించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ శ్లాంగ్ లో డైలాగులకు తన మేనరిజాన్ని జోడించిన ప్రియదర్శి....తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అదే తరహాలో తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాడని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. అందులోనూ, ఇటీవల మహేశ్ బాబు `స్పైడర్` చిత్రం ద్వారా ప్రియదర్శి తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. దీంతో, ప్రియదర్శిని తమిళ తంబీలు బాగానే రిసీవ్ చేసుకుంటారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. గౌతమ్ మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించనుంది. విష్ణు విశాల్ హీరోగా నటించనున్నాడు. సెంథిల్ వీరస్వామి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. తమిళ పెళ్లి చూపులు కూడా జాతీయ అవార్డును సాధిస్తుందో లేదో వేచి చూడాలి.