AMB మల్టీప్లెక్స్‌లో తెలుగు సినిమాల హవా.. టాప్ 10 కలెక్షన్స్!
మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ కలయికలో నిర్మితమైన ఈ మల్టీప్లెక్స్ లో తెలుగు చిత్రాలకు భారీ ఆదరణ ఉండటం విశేషం.
తెలుగు సినిమా ప్రేక్షకుల ఆరాధనకు, ప్రీమియం అనుభవానికి సంబంధించిన ప్రధాన కేంద్రంగా మారింది AMB మల్టీప్లెక్స్. మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ కలయికలో నిర్మితమైన ఈ మల్టీప్లెక్స్ లో తెలుగు చిత్రాలకు భారీ ఆదరణ ఉండటం విశేషం. ఈ స్క్రీన్స్ లో ప్రతీ సారి బిగ్ టికెట్ సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇక AMB లో అత్యదిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేస్తే..
ఇటీవల విడుదలైన పుష్ప 2: ది రూల్ ఈ మల్టీప్లెక్స్‌లో అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ, టాప్ 3లో స్థానం సంపాదించుకుంది. 46 రోజుల్లోనే రూ.4.18 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ఈ చిత్రం తన స్థాయిని చాటుకుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. AMBలో ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో తెలుగు సినిమాల స్థానం మరోసారి ప్రపంచానికి నిరూపితమైంది.
AMB మల్టీప్లెక్స్‌లో టాప్ స్థానం మాత్రం నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రభాస్ కల్కి 2898 ADకి దక్కింది. ఈ సినిమా అత్యంత భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసి AMB బాక్సాఫీస్ వద్ద రూ.4.40 కోట్ల గ్రాస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో రూ.4.36 కోట్లతో ఉంది. ఈ మూడు సినిమాలు తెలుగు సినిమా రేంజ్ ను మరో లెవెల్ కు పెంచయని చెప్పవచ్చు.
ఇక ఎన్టీఆర్ దేవర రూ.2.26 కోట్ల గ్రాస్‌తో నాల్గవ స్థానంలో ఉండగా, మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రూ.2.04 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. అలాగే లిస్టులో మహర్షి, గుంటూరు కారం సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ నటించిన సలార్ కూడా మంచి ఆదరణ పొందుతూ రూ.2 కోట్లను రాబట్టింది. ఈ టాప్ లిస్ట్‌లో చిన్న చిత్రాలైన హనుమాన్ (రూ.1.86 కోట్లు), దసరా (రూ.1.43 కోట్లు) కూడా చోటు సంపాదించడం గమనార్హం. ప్రత్యేకంగా, ప్రతి చిత్రానికి ప్రేక్షకులు చూపించిన ఆదరణతో రికార్డులు బ్లాస్ట్ అవుతున్నాయి.
AMB మల్టీప్లెక్స్ టాప్ 10 గ్రాస్ చిత్రాలు:
1. కల్కి 2898 AD - ₹4.40 కోట్లు
2. ఆర్ఆర్ఆర్ - ₹4.36 కోట్లు
3. పుష్ప 2 - ₹4.18 కోట్లు
4. దేవర - ₹2.26 కోట్లు
5. సర్కారు వారి పాట - ₹2.04 కోట్లు
6. సలార్ - ₹2.00 కోట్లు
7. మహర్షి - ₹1.94 కోట్లు
8. హనుమాన్ - ₹1.86 కోట్లు
9. గుంటూరు కారం - ₹1.43 కోట్లు
10. దసరా - ₹1.43 కోట్లు