పాట్నా మీడియాతో డస్కీ గాళ్‌ ఫైటింగ్

Update: 2016-06-13 04:15 GMT
ఇంటర్నేషనల్ గా డస్కీ బ్యూటి ప్రియాంక చోప్రా తెగ పేరు సంపాదించేసింది. హాలీవుడ్ లో కూడా పాగా వేసేసింది. ఒబామాతో డిన్నర్ లాంటి వాటితో బాగా పాపులర్ అయిపోయిన ప్రియాంక.. కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. భోజ్ పురి చిత్ర నిర్మాణం కూడా మొదలు పెట్టేసిన పీసీ.. 'బమ్ బమ్ బోల్ రహా హై కాశీ' అనే టైటిల్ పై సినిమా తీసేసింది. దీని పబ్లిసిటీ కోసం పాట్నా వెళ్లిన బేవాచ్ భామకు అనుకోని సంఘటన ఎదురైంది.

పాట్నాకు రావడం - ప్రమోషన్ చేయడం - అక్కడి స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అవడం.. ఈ సుందరాంగికి ఇదే మొదటిసారి. దీంతో పాట్నా మీడియా బాగా ఉత్సాహం చూపించేశారు. తొలిసారిగా ప్రియాంక ఇంటర్వ్యూ తీసుకునే ఛాన్స్ రావడంతో.. అత్యుత్సాహం చూపించేశారు.  దీంతో ప్రియాంకకు- మీడియాకు మధ్య మాటలతో చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ టైంలో పీసీ బౌన్సర్లు కలగచేసుకోవడంతో.. సిట్యుయేషన్ హద్దులు దాటింది.

'ప్రకాష్ ఝా కు చెందిన పీ అండ్ ఎం మాల్ కు ప్రియాంక చోప్రా వచ్చింది. మీడియాను కూడా అక్కడికే పిలిచారు. ప్రియాంక బౌన్సర్లను మీడియాను రఫ్ గా హ్యాండిల్ చేశారు. దీంతో వారు రెచ్చిపోయి మరింత ముందుకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు' అని మాల్ లో ఉన్నవారు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం షారూక్ ఖాన్ కు కూడా ఇదే మాల్ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు షారూక్.
Tags:    

Similar News