ఎలివేటర్ సెల్ఫీతో మంట‌లు పెట్టిన పీసీ

Update: 2023-01-11 04:07 GMT
అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా వ‌రుస ఫోటోషూట్లు వెబ్ లో దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. పాప్ గాయ‌కుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక ఈ స్పీడ్ మ‌రింత పెరిగింది. ఇంత‌కుముందే పీసీ స్విమ్మింగ్ సెష‌న్స్ నుంచి బోల్డ్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. తాజాగా పీసీ తన లండన్ పర్యటనలో సెల్ఫీలతో చెల‌రేగింది. క‌నువిందు చేసే ఫీట్ తో అభిమానులకు స్నీక్ పీక్ అందించింది.

ప్రియాంక ఎలివేటర్ లో నిలబడి ఫోజులిచ్చిన‌ మిర్రర్ సెల్ఫీని ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫోటోలో తన ఫోన్ వైపు చూస్తూ కెమెరాకి పోజులిచ్చింది. ఈ ఫోటోలో పీసీ పర్పుల్ కలర్ డ్రెస్.. కాంబినేష‌న్ కోట్  డిజైన‌ర్ షూస్ ని ధరించి అందంగా క‌నిపించింది. ఒక చిన్న బ్యాగ్  కూడా త‌న‌తో ఉంది. ప్రియాంక ఆ లొకేషన్ ను లండన్- యుకె అని జియో ట్యాగ్ చేసింది. పీసీ ఈ ఫోటోలో టూహాట్ గా క‌నిపిస్తోంద‌ని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆల్మోస్ట్ పీసీ బోల్డ్ అప్పియ‌రెన్స్ గుండెల్లో గుబులు రేపుతోంద‌ని కొంద‌రు కామెంట్ చేసారు.

ఈ ఫోటోని షేర్ చేయ‌క ముందే ప్రియాంక లండ‌న్ లోని తన 'బృందం' రెస్టారెంట్ వంటగదిలో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అక్క‌డ‌ కెమెరా ముందు నిలబడిన వారంతా ముసిముసిగా నవ్వారు. దట్స్ ఎ క్రూ..(రెడ్ హార్ట్ ఎమోజి) అని ప్రియాంక ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. లండన్ లైఫ్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. ఈ ఫ‌టోతో పాటు ప్రియాంక తన స్నేహితులందరినీ ట్యాగ్ చేసింది. లండన్ రెస్టారెంట్ లో డిన్నర్ కోసం టేబుల్ వద్ద కూర్చున్న ప్రియాంక ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ప్రియాంక తీసుకున్న సెల్ఫీలో ఆమెతో కలిసి కొంద‌రు అభిమానులు పోజులిచ్చారు.

ఛెలో షో (లాస్ట్ ఫిల్మ్ షో) లాస్ ఏంజిల్స్ ప్రీమియర్ ను హోస్టింగ్ చేసిన కొద్దిసేపటికే ప్రియాంక లండన్ పర్యటనకు వెళ్లింది. ఈవెంట్ నుండి ఫోటోల‌ను షేర్ చేసింది. దీనికి త‌న క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. ''నా వృత్తి అనుభ‌వంలో నాకు తెలిసినవ‌న్నీ.. నాకు నేర్పించిన పరిశ్రమకు ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వడం నా బాధ్య‌త‌. భారతీయ సినిమా నుండి వచ్చిన అద్భుతమైన సినిమాల గురించి చాలా గర్వంగా ఉంది. ఛెలో షో వీటిలో ఒకటి. ప్రత్యేకమైన చిత్ర‌మిది. గుడ్ లక్ టీమ్!'' అంటూ విష్ చేసింది పీసీ.

ఛెలో షో (చివరి సినిమా ప్రదర్శన) - ప్రాంతీయ భాషా చిత్రం (గుజూరాతీ). ఇది 95వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ప్రవేశంగా ఎంపికైంది. పాన్ నలిన్ రచించి దర్శకత్వం వహించారు.

ప్రియాంక తదుపరి ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ అనే సినిమాలో న‌టిస్తోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ' ఫిబ్రవరి 10న USలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కరోలిన్ హెర్ఫర్త్ రచించిన 2016 జర్మన్ చిత్రం SMS ఫర్ డిచ్ ఆధారంగా రూపొందించారు. త్వ‌ర‌లో ప్రియాంక - అలియా భట్- కత్రినా కైఫ్ లతో కలిసి ఫర్హాన్ అక్తర్ చిత్రం 'జీ లే జరా' కూడా ప్రారంభం కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News