వీడియో: హాలీవుడ్ వెళ్లాక `అమ‌లాపురం` అంటే ఎలా?

Update: 2019-02-07 06:30 GMT
రోమ్ వెళ్లాక రోమ‌న్ లా ఉండాల‌ని అంటారు! ప్ర‌స్తుతం మాజీ మిస్‌ ప్రియాంక చోప్రా తీరు అలానే ఉంది. లండ‌న్ వాసి నిక్ జోనాస్ ని పెళ్లాడాక ఈ అమ్మ‌డి తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఒక క్రిస్టియన్ ని హిందూ అమ్మాయి పెళ్లాడితే వ‌చ్చే మార్పు కూడా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం పీసీ హాలీవుడ్ లో ఫేమ‌స్ సెల‌బ్రిటీ. పూర్తిగా పాశ్చాత్య సంప్ర‌దాయాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న ఈ అమ్మ‌డు అక్క‌డ సూప‌ర్ గాళ్ సిరీస్ క్వాంటికోలో న‌టించి మ‌రింత‌గా పాపుల‌రైంది. ఆ క్ర‌మంలోనే క‌ట్టు.. బొట్టు.. వ్య‌వ‌హారిక శైలి అన్నీ మారిపోయాయి. రోమ్ వెళ్లాక మారాలి క‌దా! అన్న‌ట్టే త‌న రూపురేఖ‌ల్ని, డ్రెస్, ఆహార్యం ప్ర‌తిదీ మార్చేసింది.

ప‌నిలో ప‌నిగా ఆంగ్లేయుడు నిక్ జోనాస్ తో ప్రేమ‌లో ప‌డ్డాక పూర్తిగా భార‌తీయ సాంప్ర‌దాయాన్ని మ‌ర్చిపోయే స‌న్నివేశం వ‌చ్చేసింది. ప్రేమ‌, అటుపై పెళ్లి అనంత‌రం పీసీ ఇంకా ఇంకా మారిపోయింది. ప్ర‌స్తుతం లండ‌న్ కోడ‌లుగా ఓ వెలుగు వెలిగిపోతోంది. ఆ క్ర‌మంలోనే టాప్ సెల‌బ్రిటీగా ప్ర‌ముఖ ఆంగ్ల చానెళ్ల  టీవీ షోల‌లో వెలుగులు విర‌జిమ్ముతోంది. ఇప్ప‌టికే ప‌లు హాలీవుడ్ చానెళ్ల లైవ్ షోల‌లో పీసీ అద‌రగొట్టేసింది. తాజాగా మ‌రోసారి అలాంటి అవ‌కాశ‌మే ఈ అమ్మ‌డిని వ‌రించింది. ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ జిమ్మీ ఫాలెన్ నిర్వహించే టాక్ షోకు ఇటీవల ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ షోలో ప్రియాంక చోప్రా మారిన గెట‌ప్ వెబ్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఉన్న‌ట్టుండి ఈ అమ్మ‌డు బ్రాలెస్ లో క‌నిపించి షాకిచ్చింది. ఈ త‌ర‌హా లుక్ ఇప్పుడే కొత్తేమీ కాదు. అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం ఇలా క‌నిపించ‌డం ఇదే తొలిసారి. మునుప‌టితో పోలిస్తే హాట్ కంటెంట్ అనూహ్యంగా పెరిగిపోయింది. కార్పొరెట్ స్టైల్ లో క‌నిపించినా, అందులోనే అందాల విందు చేసింది. 36 ప్రాయంలో టీనేజీ గాళ్ ని త‌ల‌పిస్తోంది పీసీ. ఇక ఈ లుక్ పై నెటిజ‌నులు ఓ రేంజులో ట్రోల్ చేస్తున్నారు. మ‌రీ ఇంత‌గా సాంప్ర‌దాయం మ‌రిచిపోవాలా?  టూ హాట్ గా మారిపోయిందంటూ ఒక‌టే ట్రోలింగ్స్ త‌ప్ప‌డం లేదు. ఈ షోలో పీసీ ర‌క‌ర‌కాల సంగ‌తుల్ని ముచ్చ‌టించింది. నిక్ జోనాస్ తో ప‌రిచ‌యం, ప్రేమ‌, పెళ్లి, అటుపై కాపురం వ‌గైరా ఎన్నో ముచ్చ‌ట్లు చెప్పింది. ఇటీవ‌లే హ‌బ్బీ నిక్ ఒడిలో ఆద‌మ‌రిచి నిదురిస్తున్న ఫోటో ఒక‌టి వెబ్ లో కి వైర‌ల్ అయ్యింది. బెడ్ రూమ్ లోనూ కెమెరాలు పెట్టుకుందా? అంటూ ఫ్యాన్స్ తిట్టి పోశారు. ఆ తిట్ల దండ‌కం మ‌ర్చిపోక ముందే .. మ‌రోసారి షాకిచ్చే ఫోజుతో క‌ల‌క‌లం రేపింది. ఈసారి పూర్తిగా అస్సెట్స్‌ షో.. అది కూడా బ్రాలెస్ గా క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ మ‌రోసారి ఘాటైన వ్యాఖ్య‌ల‌తో చెల‌రేగిపోతున్నారు. మ‌రీ ఇంత బోల్డ్ గానా?  పీసీ అంటూ ఆ వీడియోల్ని జోరుగా వైర‌ల్ చేసేస్తున్నారు. పీసీ ప్ర‌స్తుతం ప‌లు హాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. అలాగే నిక్ జోనాస్ ప్ర‌ఖ్యాత డీసీ సంస్థ నిర్మించ‌నున్న `అవెంజ‌ర్స్ - ది ఎండ్ గేమ్` లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

CLICK HERE FOR VIDEO
Tags:    

Similar News