ప్రఖ్యాత టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చెప్పిన షాకింగ్ విషయాలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఓ ప్రముఖ ఫిలింమేకర్ తాను యుక్తవయసులో ఉన్నప్పుడు ఒక ‘సున్నితమైన’ నృత్య సన్నివేశం కోసం ‘లోదుస్తులకు కుట్లు వేయమని’ కోరినట్లు చెప్పారు. అయితే ఆమె ఆ సినీ దర్శకుడి పేరును బహిర్గతం చేయలేదు. తాను ఆ వయసులో భయపడ్డానని.. అప్పటికే సినీ పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ప్రియాంక తెలిపారు. అతడు కుర్చీపై కూర్చుని ఉండగా తాను పక్కనే ఉన్నానని పీసీ తెలిపారు. “వినండి,.. ఆమె ప్యాంటీ చూపించినప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు ఆమెను చూడటానికి వస్తారు. అందుకే ఆ ప్యాంటీ చిన్నదిగా ఉండాలి. నేను ఆమె డ్రాయరు చూడగలను. థియేటర్లలో ముందు వరుసలో కూర్చునేవారు.. మీకు తెలుసా? వారు ఆమె ప్యాంటీని చూడగలుగుతారు”అని సదరు దర్శకనిర్మాత అన్నారట.
అప్పుడు తనకు కేవలం 18-19 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. ఆ సినిమా కోసం రెండు రోజులు మాత్రమే షూటింగులో పాల్గొన్నానని ప్రియాంక చోప్రా తెలిపారు.
“ఆ సంఘటనపై నా బాధ ఏమిటంటే.. నేను ఆ దర్శకనిర్మాతను ఎప్పుడూ ఏమీ అనలేదు. నేను చాలా భయపడ్డాను. వినోద రంగానికి నేను కొత్త కాబట్టి.. అలా అయ్యాను`` అని తెలిపారు. అమ్మాయిలు ఎల్లప్పుడూ ‘మీరు కష్టపడి పనిచేయడం ద్వారా కీర్తిని పొందాలనుకోవడం లేదు’ అని ఓప్రాతో అన్నారు. “నేను ఎప్పుడూ అతడిని నిలదీయలేదు,‘ మీరు చేసేది తప్పు’ అనలేదు. అది బాధగా ఉంది అని కూడా పీసీ అన్నారు. ఆ సినిమా నుంచి తప్పుకోవడం ఒక్కటే తనకు మార్గం అనిపించిందని వెల్లడించారు.
నేను కాన్వెంట్ వాతావరణంలో పెరిగాను. కాబట్టి నాకు క్రైస్తవ మతం గురించి తెలుసు. నాన్న మసీదులో పాడేవారు. నాకు ఇస్లాం గురించి తెలుసు. నేను హిందూ కుటుంబంలో పెరిగాను. ఆధ్యాత్మికత భారతదేశంలో మతం చాలా పెద్ద భాగం. ఎవరూ దానిని విస్మరించలేరు`` అని పీసీ అన్నారు.
పాఠశాలలో వేధింపులకు గురయ్యానని జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని కూడా పీసీ తెలిపారు. 16 ఏళ్ల వయసులో అమెరికా బోస్టన్ లో ఉన్నప్పుడు జాతిపరంగా వేధింపులకు గురిచేశారని.. పాఠశాలలో వేధింపులకు గురయ్యానని చోప్రా వెల్లడించారు. యుక్తవయసులో గోధుమ రంగు వల్ల కూడా తాను సాటి విద్యార్థులకు టార్గెట్ అయ్యానని అన్నారు. అర్థం చేసుకోకుండా.. ఒకరిని బాధపెట్టడానికి ప్రయత్నించడం నచ్చలేదు అని ఆమె అన్నారు.
ప్రియాంక చోప్రా తల్లి వాస్తవానికి తన కోసం ఒక డ్రీమ్ బోయ్ కావాలని కలలు కన్నారు. ఇది నిక్ జోనాస్ ను కలిసేందుకు.. అతనితో ప్రేమలో పడటానికి దారితీసిందని తెలిపారు. జోనాస్ మొదట్లో టెక్స్ట్ చేయడం ప్రారంభించినప్పుడు ఆమె తీవ్రంగా పరిగణించలేదని చోప్రా చెప్పారు. “నాకు 35 ఏళ్లు.. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. నాకు పిల్లలు కావాలి. అతను తన 20 ఏళ్ళ వయసులో ఉన్నాడు.. అని చెప్పింది. కానీ ప్రేమకు తనను తాను కనుగొనటానికి ఒక మార్గం ఉంది.. అందుకే నిక్ తో పెళ్లయ్యిందని అన్నారు. ప్రియాంక చోప్రా 2018 డిసెంబర్ లో జోనాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.