రాయల్ వెడ్డింగ్ అంటే అందరికీ ఆసక్తి కనిపించడం సహజం. రీసెంట్ గా జరిగిన ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్కల్ వివాహం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. 19మే 2018న జరిగిన ఈ పెళ్లిలో హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పెషల్ గా మెరిసిపోయింది. కొత్త యువరాణితో స్టార్ హీరోయిన్ స్నేహం గురించి పలువురు స్పెషల్ గా మాట్లాడుకోవడానికి.. ఈ పెళ్లి ఈవెంట్ కారణం అయింది.
ప్రియాంక చోప్రా వీరాభిమానులకు అయితే.. నయా యువరాణితో ప్రియాంక స్నేహం ఎలా మొదలైందనే విషయంపై తెలిసి ఉండవచ్చు. కామన్ పీపుల్ కి మాత్రం ఇది ఆసక్తికరమైన పాయింట్ అయిపోయింది. నిజానికి వీరిద్దరి మధ్య రెండేళ్ల నుంచి గాఢమైన స్నేహం నడుస్తోంది. 2017లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఈ విషయాలను డీటైల్డ్ గానే చెప్పింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఓ టెలివిజన్ కార్యక్రమంలో రెండేళ్ల క్రితం తొలిసారి వీరిద్దరూ కలిశారు. తామిద్దరం యాక్టర్లుగా ఒకరికొకరు దగ్గరయ్యామని.. ఆ తర్వాత అనేక ఈవెంట్స్ లో కలిసే అవకాశం రావడం.. తమ ఇద్దరి మైండ్ సెట్ దగ్గరగా అనిపించడంతో.. వెంటనే ఇద్దరు అమ్మాయిలం ఫ్రెండ్స్ అయిపోయాని ప్రియాంక చెప్పింది.
ప్రియాంక ఓ అద్భుతమైన వ్యక్తి అని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మేఘన్ మార్కల్. ప్రియాంక లైఫ్ స్టైల్.. స్టైలింగ్ వంట అంశాలపై మేఘన్ కూడా ఇంటర్వ్యూ చేయడం విశేషం. లింగ సమానత్వం.. మానవతా విలువలు వంటివాటిపై ప్రియాంక విజన్ చూసి.. తాను ఆమెను విపరీతంగా అభిమానించడం స్టార్ట్ చేశానని ఇప్పటి కొత్త యువరాణి.. కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ స్నేహమే.. ఇప్పుడు మేఘన్ రాయల్ వెడ్డింగ్ లో ప్రియాంకకు అంత ప్రాధాన్యత కనిపించేలా చేసింది.