ఆ పెదాలకు ప్లాస్టిక్ హంగులా?

Update: 2017-07-06 07:11 GMT

బాలీవుడ్ నుండి హాలీవుడ్కి వెళ్ళిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లతో, ఫ్యాషన్ వాకులతో అమెరికన్ లైఫ్ స్టైల్ తో అభిమానులును అలరిస్తూనే వస్తుంది. ఈ క్రమంలో ఆమె పై విమర్శలు కూడా చాలనే వస్తున్నాయి. ఇక అమెరికాలో నివాసం ఉంటూనే అప్పుడుప్పుడు మనవాళ్లను ఇలా పలకిరిస్తుంది.  కాకపోతే ఆమె లుక్స్ మీదనే ఇప్పుడు చాలా రూమర్లు వినిపిస్తున్నాయి

ఆ మధ్య ఓ హింది స్క్రిప్ట్ వినడానికి వచ్చిన ప్రియాంకా పై కొంత మంది ఘాటు విమర్శలు చేశారు. ముక్కు కు ప్లాస్టిక్ సర్జరి చేసుకుందిని అది వికటించి మరింత వికారంగా తయారైందిని అన్నారు. దానికి ప్రియాంకా ఇచ్చిన సమాధానం మరింత ఘాటుగా ఉంది. నేను నా ముక్కుకు  ఏమి చేయించుకోలేదు అయన నా ముక్కు పై ఇన్సూరెన్స్‌ కూడా చేసుకున్నా మీకు అది తెలియదేమో అన్నది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకొంది ఈ ప్రపంచ సుందరి. తన సోషల్ మీడియా పేజ్ లో ఒక ఫోటో పెట్టింది. దానిలో ఆమె పెదాలలో ఏదో మార్పు ఉండటంతో ప్రియాంకా పెదాలకు కూడా సర్జరి చేసుకుంది అని ఎవరికి వారే అనేసుకొని ప్లాస్టిక్‌ బ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్‌ తో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కొద్ది రోజులు ముందు మన దేశ ప్రధానిని కలిసినప్పుడు సరైన దుస్తులు ధరించలేదు అని ఆమె పై అందరూ రాళ్ళు విసిరారు. అయితే ఇప్పుడు ఈమె పై వస్తున్న ప్లాస్టిక్‌ బ్యూటీ విమర్శ  పై ఇంకా స్పందించలేదు అమ్మడు.

ప్రస్తుతం ప్రియాంక ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూయార్క్‌లో జరుగుతోంది.​ ఇదే సమయంలో ఆమె నాలుగు లోబడ్జెట్ సినిమాలను ఇండియాలో నిర్మించడానికి ప్లాన్ చేసుకుంది. అది సంగతి. 
Tags:    

Similar News