పిక్‌ టాక్‌ : జాకెట్‌ విప్పి పరువు తీసేసింది

Update: 2019-06-08 05:08 GMT
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి వివాదాస్పదం అయ్యింది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడిని టార్గెట్‌ చేసి నెటిజన్స్‌ దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ 'ఇన్‌ స్టైల్‌' అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం ఈమె ఇచ్చిన ఫొటో షూట్‌ వివాదాన్ని రేపింది. ఇండియా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది చీర కట్టు. ఆ చీర కట్టుకుని టాప్‌ లెస్‌ పోజ్‌ ఇచ్చింది. చీర కట్టుకుని అందంగా ఉండే ప్రియాంక చోప్రా ఇలా జాకెట్‌ లేకుండా టాప్‌ లెస్‌ ఫొటోలకు ఫోజ్‌ లు ఇవ్వడంతో వివాదం ముదురుతోంది.

అమెరికా మ్యాగజైన్‌ కోసం ఇండియన్‌ చీరకట్టు పరువు తీశావు అంటూ నెటిజన్స్‌ ప్రియాంక చోప్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కొన్ని వారాల క్రితం ఒక కార్యక్రమంలో భాగంగా వింతైన హెయిర్‌ స్టైల్‌ మరియు మేకప్‌ తో విమర్శల పాలయ్యింది. మరీ వెరైటీ పేరుతో ఇలా నీచంగా మేకప్‌ అవ్వడం ఏంటీ అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలు ఏ స్థాయిలో ట్రోల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు వివాదాస్పదం అయ్యింది.

ఇన్‌ స్టైల్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ బయటకు వచ్చినప్పటి నుండి కూడా ప్రియాంక చోప్రాపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. జాకెట్‌ లేకుండా చీర కట్టులో స్కిన్‌ షో చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు కొందరితో వావ్‌ అనిపించుకుంటే మరి కొందరు మాత్రం విమర్శలతో ఏకి పారేస్తున్నారు. మరి ఈ కవర్‌ స్టిల్‌ ట్రోల్స్‌ పై ప్రియాంక చోప్రా ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News