గోల్డెన్ గ్లోబ్స్ 2023లో ఇండియన్ సినిమాకి అద్భుతమైన విజయాన్ని అందించిన SS రాజమౌళి- RRR టీమ్ ను గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అభినందించారు. అమితాబ్ బచ్చన్- షారూక్ ఖాన్-అమీర్ ఖాన్- చిరంజీవి సహా పలువురి అభినందనల తర్వాత గ్లోబల్ స్టార్ పీసీ నుంచి ప్రశంస దక్కింది.
ఇటీవల 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్ నుంచి 'నాటు నాటు..' గీతం పురస్కారం దక్కించుకున్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. జక్కన్న టీమ్ ప్రశంసలు దక్కించుకుంది. ఎం.ఎం.కీరవాణి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని ఎంతో ప్రేమగా ముద్దాడగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. కీరవాణి అద్భుత సంగీతానికి తగ్గట్టు అత్యద్భుతమైన డ్యాన్స్ మూవ్ లతో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లతో RRR దేశంలో రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగు ఎపిక్ పీరియడ్ డ్రామా RRR తో మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును భారతదేశానికి అందించడం గర్వకారణం.
బుధవారం (జనవరి 11) లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ పాల్గొంది. ఈ చిత్రం నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్న తర్వాత తారక్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఉప్పొంగిపోయారు.
తాజాగా ప్రియాంక చోప్రా RRR టీమ్ ని అభినందించింది. ఈవెంట్ లో అవార్డులను గెలుచుకున్న వీడియోను షేర్ చేసిన పీసీ ఆర్.ఆర్.ఆర్ టీమ్ కు అభినందనలు!! తెలిపారు. "గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా చిత్రం! భారతీయ సినిమాకు అద్భుతమైన విజయం!" అని పీసీ క్యాప్షన్ ఇచ్చింది.
ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్.ఆర్.ఆర్ టీమ్ ని అభినందించిన సంగతి తెలిసిందే. "ఎంతటి అద్భుతం... చారిత్రాత్మక విజయం!!!! ఎంఎం కీరవాణి గారికి గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్ అవార్డ్ !! టేక్ ఎ బో! @RRR మూవీ టీమ్ కి హృదయపూర్వక అభినందనలు. ఎస్.ఎస్.రాజమౌళి భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది!" అంటూ ప్రశంసలు కురిపించారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ .. కింగ్ ఖాన్ షారూక్ సైతం ఈ విజయాన్ని ప్రశంసించారు. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఆర్.ఆర్.ఆర్ టీమ్ పెద్ద విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. "గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నందుకు అభినందనలు RRR .. గొప్ప అర్హత తో దక్కిన విజయమిది !!" అని అమితాబ్ ప్రశంసించారు.
రామ్ చరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్లను రాబట్టింది. దాదాపు 1000 కోట్ల వసూళ్లతో రికార్డులు తిరగరాసింది. RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ అయినా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ బెస్ట్ ఫిల్మ్ విభాగంలో ఆర్.ఆర్ఆర్ పురస్కారం దక్కించుకోలేకపోయింది. అర్జెంటీనా 1985లో చిత్రానికి ఈ పురస్కారం దక్కింది.
పీసీతో హాలీవుడ్ సినిమా?
గ్లోబల్ ఐకాన్ గా పాపులరైన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ డమ్ ని ఆస్వాధిస్తోంది. ఇలాంటి సమయంలో రాజమౌళికి మరింత గుర్తింపు దక్కాలన్నా మార్కెట్ మాయాజాలాన్ని విస్తరించాలన్నా ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్ తో కలిసి మల్టీస్టారర్లు తెరకెక్కిస్తే అది అడ్వాంటేజ్ అవుతుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. రాజమౌళితో సినిమా అంటే ప్రియాంక చోప్రా సైతం వెనకాడదు. కానీ ఈ విషయంలో జక్కన్న స్పందించాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.