ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వణికిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. కరోనా వ్యాక్సిన్ వేయడం మొదలైనప్పటికీ యూకేలో దాని తీవ్రత తగ్గడం లేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కాకపోగా.. కేసులు మళ్లీ పెరుగుతూ పరిస్థితి చేయిదాటిపోయిందని ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువ అవడంతో అక్కడ నాల్గవ దశ లాక్ డౌన్ విధించారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ నుంచి విదేశాలకు విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లండన్ లో చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఇటీవల ఓ హాలీవుడ్ సినిమా చిత్రీకరణ కోసం యూకే వెళ్లిన ప్రియాంకా.. లాక్ డౌన్ కారణంగా మరికొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'టెక్ట్స్ ఫర్ యూ' అనే హాలీవుడ్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంకకు జోడీగా హాలీవుడ్ నటుడు సామ్ హ్యూగన్ నటిస్తున్నాడు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్ లో ప్లాన్ చేశారు. దీని కోసం అక్కడికి వెళ్లిన ప్రియాంక నవంబర్ 29 నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని చిత్రబృందం అధికారులను కోరినట్లు సమాచారం. కానీ అక్కడ కఠిన నిబంధనల కారణంగా అనుమతి నిరాకరించడంతో మరికొంతకాలం వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియాంకతో పాటు బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసని కూడా అక్కడే ఉండిపోయాడని తెలుస్తోంది.