టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో.. మాజీ విశ్వసుందరి.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కూడా అంతే సంచలనం రేపింది రెండు రోజుల కిందట. ప్రియాంక మూడుసార్లు ఆత్మహత్యకు పాల్పడుతుంటే తానే ఆపానని.. ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో కలకలమే రేపాయి. ఐతే ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమా కోసం అమెరికాలో ఉన్న ప్రియాంక చోప్రా.. ప్రకాష్ వ్యాఖ్యలపై ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. దీంతో ప్రకాష్ చెబుతోంది నిజమనే అనుకున్నారంతా.
ప్రియాంక తల్లి మధు చోప్రా మాత్రం ప్రకాష్ మాటలు శుద్ధ అబద్ధం అంటోంది. ‘‘ఆ అబద్ధాల కోరు జైల్లో గడిపి వచ్చాడు. అతడి తల్లిదండ్రులు తమ కొడుకుని క్షమించమంటూ ప్రియాంక కాళ్ల మీద పడ్డారు’’ అంటూ మధు చోప్రా మండి పడింది. ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేయడం అన్నది నాన్సెన్స్ అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రకాష్ జాజు 200-2004 మధ్య ప్రియాంకకు మేనేజరుగా ఉన్నాడు. ఐతే అతడితో విభేదాలు తలెత్తడంతో ఉన్నట్లుండి తన కాంట్రాక్టును రద్దు చేసింది ప్రియాంక. దీనిపై అతను కోర్టుకెక్కాడు. ఆ తర్వాత ప్రకాష్.. తన కూతుర్ని వేధిస్తున్నాడంటూ ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ప్రకాష్ 67 రోజుల పాటు జైల్లో కూడా గడిపాల్సి వచ్చింది. ఐతే ప్రత్యూష ఆత్మహత్య నేపథ్యంలో.. ప్రియాంక వివిధ సందర్భాల్లో ఆత్మహత్యాయత్నం చేస్తుంటే తానే కాపాడానని ప్రకాష్ సంచలన ట్వీట్లు చేశాడు.