బాలీవుడ్ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి గ్లోబల్ స్టార్ అనిపించుకున్న ప్రియాంక చోప్రా కొన్ని నెలల క్రితం అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ పెళ్లి అత్యంత గ్రాండ్ గా జరిగింది. హిందూ మరియు క్రిస్టయన్ మతాచారాల ప్రకారం ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు చాలా ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో పీసీ మరియు నిక్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక యూఎస్ మ్యాగజైన్ లో కథనం వచ్చింది.
ప్రియాంక చోప్రా మరియు నిక్ లు వారి నాలుగు నెలల వైవాహిక జీవితంకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు, ఇద్దరి మద్య విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారు అంటూ వార్త రాయడం జరిగింది. ఆ వార్తలు ముఖ్యంగా ఇండియాలో ప్రకంపనలు పుట్టించాయి. బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఆ విషయమై చర్చ జరిగింది. నాలుగు నెలల్లోనే నిక్ ను వదిలేస్తుందంటూ ప్రియాంక చోప్రాపై విమర్శలు పుట్టుకు వచ్చాయి. తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రియాంక చోప్రా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రియాంక చోప్రా మరియు నిక్ లు ఆ అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయాలని నిర్ణయించుకున్నారు. తమ మనో భావాలను దెబ్బ తీయడంతో పాటు తమ వైవాహిక జీవితం నాశనం అయ్యేలా కథనం రాసినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు, సదరు మ్యాగజైన్ పై కఠినంగా వ్యవహరించాలని కోర్టును పీసీ ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తోంది. సాక్ష్యాధారాలు లేకుండా రాసినందుకు గాను ఆ మ్యాగజైన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు కూడా అంటున్నారు.