ఫోటో స్టోరీ: వాట్ ఏ హాటీ పీసీ

Update: 2017-11-01 04:51 GMT
బాలీవుడ్ కం హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడు ఏ హీరోయిన్ కి అయినా చాలా కష్టమైన విషయమే. హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికో తో అరంగేట్రం బాగానే ఉన్నా.. బేవాచ్ మూవీ ఈమెను కొంత డిజప్పాయింట్ చేసిన మాట వాస్తవమే.

అయితే.. బేవాచ్ రిలీజ్ అయ్యే సమయానికే హాలీవుడ్ లో తన బేస్ ను చాలా స్ట్రాంగ్ గా మార్చేసుకున్న ప్రియాంక.. ఇప్పుడు దాదాపుగా అక్కడే సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా ఈ భామ ఫెమిన కవర్ పేజ్ పై మిలమిలలు చూపించేసింది. డ్రెస్ అంతా డైమండ్స్ పొదిగినట్లుగా ఉన్న ఆహార్యం ఈ ఫోటో స్పెషాలిటీ. ఓ వైట్ ఓవర్ కోట్ ను కూడా వయ్యారంగా ధరించింది కానీ.. అదేమీ అందాల మోతకు అడ్డు రాలేదు. పైగా ఈ డైమండ్ డ్రెసింగ్ లో నుంచి కూడా చాలానే అందాలు కనిపించేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది ప్రియాంక.

అన్నిటికంటే ముఖ్యంగా అమ్మడి కళ్లలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎలాంటి వాటికైనా తొణికే సమస్యే లేదు అన్న విషయాన్ని.. కళ్లతోనే ప్రియాంక చెబుతున్న తీరుకు అద్భుతహ అనాల్సిందే. పిగ్గీ ఛాప్స్ లుక్ ముందు మిగతావన్నీ అదనపు అట్రాక్షన్స్ మాత్రమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంక లేటెస్ట్ ఫోటో షూట్ హాట్ హాట్ గా చక్కర్లు కొట్టేస్తోంది.
Tags:    

Similar News