ఈ ఏడాది ఆస్కార్ కు నామినేషన్లు ప్రకటించే అర్హత ప్రియాంకకు తన భర్త నిక్ జోనాస్ కు ఉందా? అని ట్వీట్ లో అడిగిన ఆస్ట్రేలియా ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్టుకు చెంప చెల్లుమనే సమాధానమిచ్చారు పీసీ.
నిజానికి ప్రియాంక చోప్రా నటించిన `ది వైట్ టైగర్` చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఐఎండీబీలో చక్కని రేటింగ్ కూడా దక్కించుకుంది ఈ మూవీ. ఇక సదరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టుకు పీసీ కౌంటర్ ఇచ్చిన విధానం సర్వత్రా చర్చనీయాంశమైంది.
``ఒకరికి అర్హత ఏమిటనే దానినే మీరు ఆలోచిస్తారా.. దానినే ప్రేమిస్తారా? ఇక్కడ నా 60 + సినిమాలను పరిశీలించండి. ఇవే నా ప్రూఫ్`` అంటూ సామాజిక మాధ్యమాల్లో కౌంటర్ ప్రత్యుత్తరం రాసారు పీసీ.
నిజానికి పీటర్ పోర్ట్ ఆస్ట్రేలియా & ఎన్ జెడ్ లో చక్కని పాపులారిటీ ఉన్న ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్టు. అతడు పీసీకి రిప్లయ్ ఇస్తూ..``మీ ఇద్దరినీ అగౌరవపరచలేదు.. కానీ సినిమాల్లో సహకారం ఆస్కార్ నామినీలను ప్రకటించటానికి అర్హతనిస్తుందని నాకు తెలియదు`` అని వ్యాఖ్యానించారు.
ఇక పీసీని అలా కామెంట్ చేసిన సదరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టుకు అభిమానులు ధీటైన సమాధానమిచ్చారు. `వాచ్ బర్ఫీ` అంటూ కొందరు సూచిస్తే.. నటి నిర్మాత.. గాయని ఆల్ రౌండర్ అంటూ పీసీని చాలామంది పొగిడేశారు. తను నటించి నిర్మించిన `ది వైట్ టైగర్` ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ కలిగి ఉందని మీరే అనేక స్పందనలలో గుర్తు చేశారని కొందరు వ్యాఖ్యానించారు. క్రిష్ ఫ్రాంచైజీలోని రెండు సినిమాలు.. అగ్నిపథ్- బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్స్ నుండి ది స్కై ఈజ్ పింక్- దిల్ ధడక్నే దో - బర్ఫీ వంటి ప్రశంసలు పొందిన ప్రాజెక్టుల వరకు ప్రియాంక చోప్రా చాలా చిత్రాలలో పెద్ద స్టార్ అన్న సంగతిని ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
ప్రియాంక ABC సిరీస్ క్వాంటికో లో నటించింది. డ్వేన్ జాన్సన్ ఐకానిక్ టీవీ షో బేవాచ్ ఫీచర్ ఫిలిం వెర్షన్ లో నటించింది. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ .. డేటింగ్ యాప్ బంబుల్ లో పెట్టుబడిదారు.. అన్ ఫినిష్డ్ పేరుతో ఒక ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసారు.
ప్రియాంక చోప్రా పనితనం ప్రతిభ గురించి తెలియని వారు ఆమెను బహిరంగంగా విమర్శించడానికి అనర్హులు అని కొట్టి పారేశారు అభిమానులు. 2018 లో నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్నప్పుడు తనపై ప్రదర్శించిన జాత్యహంకారాన్ని గుర్తు చేసుకున్నారు కొందరు. ది కట్ అనే మ్యాగజైన్ గ్లోబల్ స్కామ్ స్టర్ అని పీసీపై వ్యాఖ్యానించింది. ఆ తర్వాత క్షమాపణ కోరుతూ పీసీ-నిక్ జంటకు ట్వీట్ చేసింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రియాంక చోప్రా తదుపరి మ్యాట్రిక్స్ 4లో నటిస్తున్నారు. టెక్స్ట్ ఫర్ యు లండన్ షూటింగ్ ఇటీవల పూర్తయింది.