ఈమెకు ఏడాదికే ఇంత అనుభవం వచ్చిందే!

Update: 2019-11-01 01:30 GMT
గ్లోబల్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు గత ఏడాది డిసెంబర్‌ లో అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. తనకంటే పది సంవత్సరాల వయసు చిన్నవాడిని ఈమె పెళ్లి చేసుకోవడంతో మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. హాలీవుడ్‌ లో పేరు కోసం అంటూ కొందరు.. డబ్బు కోసం అంటూ మరికొందరు విమర్శలు చేశారు. ఎవరెన్ని చేసినా కూడా ప్రియాంక చోప్రా మరియు నిక్‌ లు చాలా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల తన వైవాహిక జీవితం గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. భార్య భర్తలు ఏ ప్రొఫెషన్‌ లో ఉన్నా కూడా ఒకరికి ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ఉండాలి. మేము పెళ్లి చేసుకున్న సమయంలోనే ఒకరిని చూడకుండా ఒకరం మూడు వారాలకంటే ఎక్కువ టైం ఉండకూడదని.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మూడు వారాల్లో కనీసం ఒక్కసారైనా కలవాల్సిందే అనే రూల్‌ తో వెళ్తున్నాం. ఇద్దరం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రతి రోజు వీడియో కాల్‌ మాట్లాడుకోవడం మాత్రం తప్పనిసరి. ప్రొఫెషనల్‌ లైఫ్‌ బిజీలో ఉండి చాలా మంది తమ జీవిత భాగస్వామిని పట్టించుకోక పోవడం వారికి టైం కేటాయించక పోవడం వల్ల విడాకుల వరకు వెళ్తుంది.

జీవితంలో జీవిత భాగస్వామి కంటే ముఖ్యం ఏదీ ఉండదు. అందుకే తప్పనిసరిగా జీవిత భాగస్వామికి ఎంత బిజీగా ఉన్నా కూడా రోజులో కనీసం కొంత సమయంను కేటాయించాలి. అలా కేటాయించడం వల్ల గొడవలు మనస్పర్థలు అనేవి రావని ప్రియాంక చోప్రా చెబుతోంది. నా ప్రొఫెషనల్‌ లైఫ్‌ ను పెళ్లి అయ్యాక మేనేజ్‌ చేయడం కష్టంగా ఉంది. కాని నిక్‌ నన్ను అర్థం చేసుకుంటాడు. నేను నా పనిపై చూపే శ్రద్ద మరియు ఆసక్తిని నిక్‌ చాలా ఇష్టపడతాడు. దాన్ని చూసే నన్ను ప్రేమించానని అంటూ ఉంటాడు.

నా వివాహం గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కాని ఎవరి ఉద్దేశ్యాలు వారివి. నేను ఎవరిని విమర్శించను. నా జీవితంను నేను సాధ్యం అయినంత వరకు ఎంజాయ్‌ చేస్తూ జీవిస్తూ ఉన్నాను. నా జీవితంలో నిక్‌ ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద మంచి పని. నేను మరింతగా ఎదిగేందుకు నా కెరీర్‌ లో విజయాలను సాధించేందుకు ఎప్పుడు కూడా నిక్‌ నన్ను సపోర్ట్‌ చేస్తూనే ఉంటాడు. భార్య భర్తలు ఒకరికి ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ప్రతి రోజు ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకుంటే విడాకులు అనేవి ఉండవని ప్రీయాంక చెబుతోంది. పెళ్లి అయ్యి ఇంకా సంవత్సరం కాకుండానే ప్రియాంక చాలా అనుభవాన్ని ఘడించిందే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
   

Tags:    

Similar News