పిగ్గీ ఛాప్స్.. బిగదీసి ఊరిస్తోంది

Update: 2016-06-17 10:26 GMT
ప్రియాంక చోప్రా లాంటి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ ఓ మేగజైన్ కవర్ పై ఎక్కడం పెద్ద వింతేం కాదు. మామూలుగానే అమ్మడు ఎక్కని మేగజైన్ లు ఉండవు.. చూడని కవర్ పేజ్ లు ఉండవు. ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్ గా కూడా టర్నింగ్ ఇచ్చేసుకున్నాక స్పీడ్ మరింతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మాక్జిమ్ మేగజైన్ కి గాను జూన్ నెలలో స్పెషల్ డబుల్ ఎడిషన్ ఇచ్చారు. దీని కవర్ పేజ్ పై ప్రియాంక ఎక్కేసి ఊరించే పోజ్ ఇచ్చేసింది.

హాటెస్ట్ విమన్ ఇన్ ది వరల్డ్.. ద వన్ అండ్ ఓన్లీ ప్రియాంక చోప్రా అంటూ ఈ ఎడిషన్ కవర్ పేజ్ పై  ప్రింట్ చేసిన కామెంట్ అక్షర సత్యం. టాప్ టు బాటం బ్లాక్ అండ్ బ్లాక్ వేర్ ఇరగదీసేసింది. నడుం కింద నుంచి వేసిన ట్రాన్సపరెంట్ వేర్ అయితే అదరహో. ఇక ఒళ్లంతా బిగదీసేసినట్లు వేసిన డ్రసింగ్ చూస్తే.. అభిమానులకు నరాలన్నీ బిగదీసేసిన ఫీలింగ్ కలుగుతోంది. అందాల ప్రదర్శనకు కేశాలు అడ్డం వస్తాయని అనుకుంటా.. హెయిర్ ని చేత్తో పట్టుకుని.. అందాన్ని ఆస్వాదించమని ఊరిస్తోంది.

వరల్డ్ హాట్ 100 అంటూ విడుదల చేస్తున్న ఈ ఎడిషన్ కవర్ పేజ్ ఒకటే ఇలాగుంటే.. లోపల ప్రియాంక ఇంకెంత రెచ్చిపోయిందో.. ఆ మిగిలిన 99మంది ఏ రేంజ్ లో అందాలు ఆరేశారో చూడాలనే ఆతృత.. బ్యూటీ లవర్స్ లో పెరిగిపోతోంది.
Tags:    

Similar News