పుట్టినరోజు పార్టీ ఉంది. రండి రండి. అతిధులూ వెల్ కమ్. 8.30కి షార్ప్ గా వచ్చేయండి అని చెప్పి.. ఆ పార్టీకి బర్త్ డే సెలబ్ ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుంది? అక్కడికి హడావుడిగా వచ్చేసిన అతిధులకు కాలిపోదూ? కోపం నషాలాన్ని అంటుకోదూ? అదే జరిగింది ఓ చోట. వివరాల్లోకి డీప్‌గా వెళితే..
జూలై 18.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈ సందర్భంగా అదరిపోయే రేంజులో పార్టీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 8.30కే పార్టీ మొదలైపోతుందని ముందే చెప్పారు కాబట్టి అతిధులంతా టిప్ టాప్ గా తయారైపోయి వచ్చేశారు. కానీ ఎంత ఎదురు చూసినా బర్త్ డే బేబి రానేలేదు. దాదాపు రెండు గంటల సమయం ఓపిగ్గా ఎదురు చూశారు. ప్రియాంక మమ్మీ కి ఒకటే షంటింగ్. ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది? అంటూ అతిధులంతా ప్రశ్నల వర్షం కురిపించి అసహనం వెళ్లగక్కారు. అయితే తీరిగ్గా రాత్రి 10.30కి విచ్చేసింది అమ్మడు.
అసలు ఇంత ఆలస్యానికి కారణం ఏంటి? అని అడిగితే షూటింగు నుంచి రావడం ఆలస్యమైందని ప్రియాంక సమాధానమిచ్చింది. ప్రస్తుతం ప్రియాంక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం లో 'భాజీరావు మస్తానీ' చిత్రంలో నటిస్తోంది. 8.30కే ప్యాకప్ అని చెప్పినా.. అంతకంతకు షూటింగ్ సాగుతూ 10.30వరకూ కొనసాగింది. దాంతో ఆలస్యం తప్పలేదన్నమాట! ప్రియాంక వచ్చిన తర్వాత వేడుకలకు సంజయ్ లీలా కూడా హాజరయ్యారు. అదీ మ్యాటరు.