అనంతపురంలో పెరిగిన మరాఠి ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ తాజాగా ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమానే విజయ్ దేవరకొండ వంటి క్రేజీ స్టార్ తో చేయడం వల్ల ఈమెకు అనూహ్యమైన గుర్తింపు దక్కింది. ఎన్నో ఒడిదొడుకుల మద్య విడుదలైన ట్యాక్సీవాలా విజయాన్ని దక్కించుకోవడంతో పాటు - ఆ చిత్రంలో హీరోయిన్ పాత్రతో ఆకట్టుకోవడంతో ప్రియాంక జవాల్కర్ తెలుగులో బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియాలో ఈమెను టార్గెట్ చేసి - ట్రోల్స్ చేయడం - ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియాంక ఇంటర్మీడియట్ లో దిగిన ఒక పాస్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ప్రియాంక జవాల్కర్ చాలా బొద్దుగా - మొహంపై ముటిమతో - ఒక సాదారణమైన అమ్మాయిలా ఉంది. ఇప్పుడు ఆ ఫొటోను ప్రస్తుతపు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఎంత మార్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు వెయిట్ లాస్ మెడిసిన్ తీసుకోక ముందు - వెయిట్ లాస్ మెడిసిన్ తీసుకున్న తర్వాత అన్నట్లుగా ఉందని పోస్ట్ లు పెడుతున్నారు. రకరకాల కామెంట్స్ తో ప్రియాంక ఫొటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కొందరు మాత్రం ఆ ఫొటో మార్ఫింగ్ చేసిందని - ప్రియాంకది అయ్యి ఉండదని అంటున్నారు.
ప్రియాంకకు ఆ ఫొటో గురించి స్పందించాల్సిన అవసరం లేదు - కాని తాజాగా ఆ ఫొటోపై స్పందించింది. ఆ ఫొటో తనదే అని, తాను ఇంటర్మీడియట్ లో ఉన్న సమయంలో ఆ ఫొటోను తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. అప్పుడు లావుగా ఉన్నాను - ఇప్పుడు ఫిట్ గా ఉన్నాను. అందులో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు - ఆ ఫొటోలో అంతగా వింత ఏముంది? జనాలు నన్ను తెగ ట్రోల్ చేస్తున్నాను. అయినా పర్వాలేదు - ఎందుకంటే నటిగా నేను వాటన్నింటిని మోయాల్సి ఉంటుందని ముందే ఫిక్స్ అయ్యాను అంటూ పోస్ట్ చేసింది. ప్రియాంక పోస్ట్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఒక్క సినిమా చేసిన ప్రియాంక ఇంత మెచ్యూరిటీగా ట్రోల్స్ ను స్వీకరించడం నిజంగా అభినందనీయం.
‘ట్యాక్సీవాలా’ చిత్రం తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈమె ఉంది. ఇటీవలే ఈమె రవితేజ - విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రంను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.