స‌ముద్రం మధ్య‌ ప‌డ‌వ‌లో పీసీ -నిక్ సెల‌బ్రేష‌న్స్

Update: 2022-01-03 16:30 GMT
`న్యూ ఇయ‌ర్` వేడుక‌ల్లో భాగంగా బాలీవుడ్ క‌పుల్స్ ఒక్కొక్క‌రుగా ఆ మూవ్ మెంట్స్ ని రివీల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ న్యూ ఇయ‌ర్ ని ఎంత గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు? అన్న‌ది ఇన్ స్టా వేదిక‌గా పంచుకున్నారు. ఈసారి ఈ జంట స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా..అంద‌రికంటే విభిన్నంగా సముద్రం మ‌ధ్య‌లో ప్ర‌యాణిస్తోన్న‌ ప‌డ‌వ‌లో సెల‌బ్రేట్ చేసుకున్నారు. ప్రియాకం చోప్రా భ‌ర్త ఒడిలో ప‌డుకుని ఆ నేచుర్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇందులో పీసీ షోల్డ‌ర్ లెస్ గులారీ క‌ల‌ర్ గౌను ధ‌రించింది. ఇక నిక్ మ్యాచింగ్ ఎరుపు పూల చొక్కా ధ‌రించాడు.

ఇన్ స్టా వేదిక‌గా పీసీ ఈ ఫో్టోల్ని పంచుకుంది. నిక్ పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటి చెప్పింది. జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. అంద‌రికీ హ్యాపీ న్యూ ఇయ‌ర్.. `హెవెన్` అనే ట్యాగ్ ని జోడిచింది. ఇదే విహార యాత్ర‌లో పీసి నారిజ రంగు బికినీ ధ‌రంచి స‌న్ బాత్ చేస్తూ క‌నిపిచింది. అలాగే నిక్ తో కలిసి భోజ‌నం చేస్తున్న‌ట్లు మ‌రో ఫోటో ఉంది. మొత్తానికి కొత్త సంవత్స‌రం వేడుక‌ల్ని గ్రాండ్ గానే సెల‌బ్రేట్ చేసుకుంది పీసీ. ఇటీవ‌లే ప్రియాంక కొత్త హాలీవుడ్ చిత్రం `ది మ్యాట్రిక్స్ రిసరెక్ష‌న్స్` థియేటర్లో రిలీజ్ అయింది.

ఇక గ్లోబ‌ల్ స్టార్ బాలీవుడ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే అడ‌పాద‌డ‌పా హిందీలోనూ సినిమాలు చేస్తోంది. అయితే పెళ్లైన త‌ర్వాత అమెరికాలోనే స్థిర‌ప‌డింది. భ‌ర్త‌తో క‌లిసి అక్క‌డే ఉంటుంది. హిందీలో సెలక్టివ్ గానే క‌మిట్ అవుతోంది. మునుప‌టి అంత‌టి ఆస‌క్తిని ఉత్తరాది చిత్రాల‌పై చూపించ‌లేదు. ప్ర‌స్తుతం ప‌ర్హాన్ అక్త‌ర్ స‌ర‌స‌న `జీలే జ‌రా` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇంకా హ‌లీవుడ్ లో మ‌రికొన్ని చిత్రాలు చేతిలో ఉన్నాయి.
Tags:    

Similar News