కూతురు పుట్టుక.. సరోగసికి వెళ్లడంపై ప్రియాంక షాకింగ్ విషయాలు వెల్లడి

Update: 2023-01-21 02:30 GMT
కూతురు మాల్తీ తో ఇప్పుడు ప్రియాంక చోప్రా మరియు ఆమె భర్త నిక్ జోనాస్ లు చాలా సంతోషంగా ఉన్నారు.. కానీ మాల్తీ పుట్టడానికి ముందు మరియు పుట్టిన కొన్ని నెలల వరకు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రా ఒక ప్రముఖ మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

సరోగసికి వెళ్లడం.. మాల్తీ పుట్టిన సమయంలో తను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి మొదటి సారి ప్రియాంక చోప్రా నోరు విప్పింది. తన ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే సరోగసికి వెళ్లినట్లుగా ప్రియాంక చోప్రా పేర్కొంది. తల్లి కావాలనే ఆశ ఉన్నప్పటికి ఆరోగ్యం సహకరించలేదని ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది.

సరోగసి మదర్ కోసం చాలా నెలల పాటు వెదికాం.. చివరకు ఒక గొప్ప వ్యక్తి మాకు మాతృత్వం ప్రసాదించేందుకు ఒప్పుకుంది. మా పాప నెలలు నిండకుండానే పుట్టింది. దాంతో ఆమెను ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స అందించినట్లుగా పేర్కొంది.

పాప పుట్టిన సమయంలో ఆపరేషన్‌ థియేటర్‌ లో నిక్ ఉన్నాడు. పాప పుట్టిన సమయంలో నిక్ చేతి కంటే కూడా చిన్న పరిమాణంలో ఉంది. ఆమెను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. మొదటి సారి మాల్తీ ని చూసిన సమయంలో షాక్ అయ్యామని పేర్కొంది.

ఎన్‌ఐసీయూ లో నర్స్ లు అత్యంత జాగ్రత్తల మధ్య మా పాప మూడు నెలల పాటు ఉందని ప్రియాంక చోప్రా అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది. నిజంగా నర్స్ లు దేవుడు రూపాలు.. వారి వల్లే మా పాప ప్రస్తుతం ఇలా ఉందని పేర్కొంది. ఈమధ్య కాలంలో పాప యొక్క ఫొటోలను పీసీ షేర్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఫేస్ ను మాత్రం రివీల్‌ చేయలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News