గొప్ప మ‌న‌సు చాటుకున్న అభిషేక్ అగ‌ర్వాల్!

Update: 2022-10-28 15:23 GMT
క‌శ్మీరీ పండిట్ ల ఊచ‌కోత దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అత్యంత సున్నిత‌మైన అంశం నేప‌థ్యంలో డైనిమిక్ ప్రొడ్యూస‌ర్‌, అభిషేర్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన `క‌శ్మీర్ ఫైల్స్‌` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అంతే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. ఈ మూవీతో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు నిర్మాత అభిషేర్ అగ‌ర్వాల్.  

విభిప‌న్న‌మైన సినిమాలు నిర్మిస్తూనే సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ పాలు పంచుకుంటూ త‌న గొప్ప మ‌న‌సుని చాటుకుంటున్నారు. రీసెంట్ గా సీసుల్ మీడియా ఫ్యాక్ట‌రీ తో క‌లిసి నిఖ‌ల్ హీరోగా `కార్తికేయ 2` మూవీని నిర్మించారు. చందూ మొండేటి డైరెక్ట‌ర్ చేసిన ఈ సినిమా ఊహించ‌ని విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. అంతే కాకుండా వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిఖిల్ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

హిందీ మార్కెట్ లో రికార్డు స్థాయిలో రూ. 30 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం విశేషం. ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మితా సినిమాల‌తో పాటు సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ చుర‌కుగా పాల్గొంటూ త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ త‌న వంతు స‌హాయం చేసి గొప్ప మ‌న‌సుని చాటుకున్నారు.తాజాగా మ‌రో అడుగు ముందుకేసి తెలంగాణ లోని తిమ్మాపూర్ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోనుండ‌టం విశేషం. రంగారెడ్డి జిల్తా కందుకూరు మండ‌లం తిమ్మాపూర్ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోబోతున్నారు.

ఈ గ్రామం బీజేపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి పుట్టిన గ్రామం. ఆయ‌న‌తో స‌న్నిహిత సంబంధాలున్న అభిషేక్ అగ‌ర్వాల్ ఆయ‌న పుట్టిన ఊరినే ద‌త్త‌త తీసుకోనుండ‌టం యాదృశ్చికం. ఇక చంద్ర‌క‌ళ ఫౌండేష‌న్ పై అభిషేక్ అగ‌ర్వాల్ ఫ్యామిలీ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తోంది.

అయితే అక్టోబ‌ర్ 30న అభిషేక్ అగ‌ర్వాల్ తండ్రి తేజ్ నారాయ‌ణ్ అగ‌ర్వాల్ 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా చంద్ర‌క‌ళ ఫౌండేష‌న్ 3వ సార్థ‌క్ దివ‌స్ ని నిర్వ‌హిస్తున్నారు. జేఆర్సీ ఫంక్ష‌న్ హాలులో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి హాజ‌రు కాబోతున్నారు.  ఈ సంద‌ర్భ‌గానే తిమ్మాపూర్ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోబోతున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News