గీతా ఆర్ట్స్ బ్యాక్ అవుట్ అయిందా?

Update: 2019-02-05 08:53 GMT
'అ ఆ' విజయంతో  హీరో నితిన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాడని కొంతమంది అంచనా వేసినా అలా ఏమీ జరగలేదు.  నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడం అటుంచితే అసలు విజయాలు లేక సతమతమవుతున్నాడు నితిన్.  కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా నితిన్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు.  నితిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి 'కుమారి 21F' ఫేం సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుందని మొదట్లో అన్నారుకానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను గీతా వారు నిర్మించడం లేదట.  సుకుమార్ కు తన శిష్యుడు తయారు చేసిన కథ బాగా నచ్చిందని.. అందుకే ఈ ప్రాజెక్టుకు మరో నిర్మాతను సెట్ చేయాలని చూస్తున్నాడట.  సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో పాటు కలిసి సంయుక్తంగా నిర్మించేందుకు ప్రస్తుతం మరో నిర్మాత శరత్ మరార్ తో సుక్కు చర్చలు జరుపుతున్నాడట. అంతా సవ్యంగా జరిగితే ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే నితిన్ ఈ సినిమా ఫైనలైజ్ అయ్యేలోపు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' టైటిల్ తో తెరకెక్కనున్న సినిమాకు రెడీ ఆవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  మార్చ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.
Tags:    

Similar News