కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్3.. రిలీజ్ పోస్ట్ పోన్ అనే విషయం ఇప్పుడు అఫీషియల్. డిసెంబర్ 23న ఈ మూవీ థియేటర్లలోకి రావడం లేదు. ఇంకా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ కూడా లేదు. డిసెంబర్ 30 అనే మాట వినిపిస్తోంది కానీ.. నిర్మాతలు మాత్రం జనవరి 6న కానీ.. జనవరి 26న కానీ విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఇలా ఎస్3 వాయిదా పడ్డమే ఇప్పుడు సమస్యలకు కారణం అవుతోంది. తెలుగులో ఈ మూవీని మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేస్తున్నాడు. ఎస్3 కోసం ఏకంగా రూ. 18 కోట్ల భారీ మొత్తాన్నే వెచ్చించాడీ నిర్మాత. ఇప్పటికే ఓసారి పోస్ట్ పోన్ అయింది. ఓ వారమే కదా అని అడ్జస్ట్ అయితే.. ఇప్పుడు సడెన్ గా ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పొజిషన్ ఏర్పడ్డంతో.. తన డబ్బులు మొత్తం వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నాడట తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రొడ్యూసర్.
ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చినవారి నుంచి శివకుమార్ కు ఇదే టైపు ఒత్తిళ్లు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు 18 కోట్లు రిటర్న్ చేయడం అంటే.. అది కూడా మూవీ వాయిదా వేసుకున్న పరిస్థితుల్లో.. తమిళ నిర్మాతలకు కూడా చాలా కష్టమైన విషయమే. మరి మూడో సింగంకు వచ్చిన ఈ కష్టం ఎలా తీరుతుందో.. ఎలాంటి టర్నింగ్ ఇచ్చుకుంటుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/