టాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు దిల్ రాజు. అయితే గత కొంతకాలంగా అగ్ర నిర్మాత పరిస్థితి అంతగా బాగా లేదనే చెప్పాలి. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఒకప్పటిలా హిట్లు అందుకోలేకపోతున్నారు. ఆయన జడ్జిమెంట్ తప్పి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
2019 లో వచ్చిన 'ఎఫ్ 2' సినిమా తర్వాత దిల్ రాజు మళ్లీ అలాంటి బ్లాక్ బస్టర్ సాధించలేదనే చెప్పాలి. రాజ్ తరుణ్ తో తీసిన 'ఇద్దరి లోకం ఒకటే'.. శర్వానంద్ - సమంతల కాంబోలో చేసిన 'జాను' సినిమాలు పరాజయం చెందాయి. నాని హీరోగా రూపొందించిన 'వి' సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబడింది. ఇది కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన 'వకీల్ సాబ్' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోలేకపోయింది. అలానే మొగలి రేకులు ఆర్కే నాయుడు తో తీసిన 'షాదీ ముబారక్' లాంటి చిన్న సినిమా కూడా నిరాశ పరిచింది.
ఇదే క్రమంలో దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను హీరోగా లాంచ్ చేస్తూ 'రౌడీ బాయ్స్' అనే సినిమాని రూపొందించారు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అలానే తమిళ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రాన్ని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేయగా.. నష్టాలనే మిగిల్చింది.
ఇక తొలి అడుగుతోనే బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలనుకున్న ప్లాన్స్ మీద కరోనా బాగానే దెబ్బ కొట్టింది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన 'జెర్సీ' చిత్రాన్ని అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో చేసిన 'ఎఫ్-3' మూవీ సైతం అంచనాలను అందుకోలేకపోవడంతో.. కొంత మేర నష్టాలు తప్పలేదు. హిందీలో చేసిన 'హిట్' మూవీ కూడా హిట్ అవ్వలేదు. లేటెస్టుగా వచ్చిన 'థాంక్యూ' సినిమా దిల్ రాజు కు గట్టి షాక్ ఇచ్చిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ రాబోయే రెండు సినిమాలపైనే అసలు పెట్టుకున్నారు.
కోలీవుడ్ హీరో విజయ్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ ''వారసుడు'' అనే తెలుగు తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం నిర్మాత గట్టిగానే ఖర్చు చేస్తున్నారు.
అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో RC15 చిత్రాన్ని రూపొందిస్తున్నారు దిల్ రాజు. ఇది తన బ్యానర్ లో రానున్న 50వ సినిమా. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమా పూర్తయ్యే నాటికి దాదాపు 200 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ని బ్యాంక్ రోల్ చేస్తున్నారు దిల్ రాజు. వీటి కొన్ని చిన్న మీడియం రేంజ్ సినిమాలను కూడా హోల్డ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిత్రాలు అగ్ర నిర్మాతకు ఎలాంటి విజయాలు అందిస్తాయో చూడాలి.