రంగంలోకి రాజుగారు..బుక్ మైషో తో చ‌ర్చ‌లు!

Update: 2022-02-20 18:11 GMT
ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ పోర్ట‌ల్ `బుక్ మై షో`ని నైజాంలో డిస్ర్టిబ్యూట‌ర్లు బ్యాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుంచి 30 రూపాయ‌లు అద‌నంగా వ‌సూల్ చేస్తున్నార‌ని ప‌రిశ్ర‌మ పిర్యాదుతో పంపిణీదారులు రంగంలోకి దిగి బ్యాన్ చేసిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

ఆ కార‌ణంగానే ముందుగా నైజాంలో యాప్ ని బ్యాన్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే అస‌లు కార‌ణం అది కాద‌ని తాజాగా వెలుగులోకి వ‌స్తోంది. డిస్ర్టిబ్యూట‌ర్ల ఆందోళ‌న ప్రేక్ష‌కుడి మీద బారం వేస్తున్నార‌ని కాద‌ని..త‌మకు రావాల్సిన దాన్ని `బుక్ మై షో` షేర్ పేరిట లాగేస్తుంది అన్న వ్య‌ధ‌తో బ్యాన్ చేసిన‌ట్లు అంత‌ర్గ‌త నివేదిక‌లు వెల్ల‌డించాయి.

అయితే ఇప్పుడీ సీన్ లోకి  నిర్మాత‌..పంపిణీ దారుడు దిల్ రాజు రంగంలోకి దిగారు. `భీమ్లా నాయ‌క్` నైజాం హ‌క్కుల్ని దిల్ రాజు లాక్ చేసిన సంగ‌తి  తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 25న చిత్రం రిలీజ్ అవుతుంది. బుక్ మై షో బ్యాన్ నేప‌థ్యంలో యాజ‌మాన్యంతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి రాజుగారు రంగంలోకి దిగారు.

విన‌యోగ‌దారుడు నుండి రుసుము వ‌సూలు చేసిన త‌ర్వాత బీఎమ్ ఎస్ వాస్త‌వానికి టిక్కెట్ ధ‌ర నుంచి 11 శాతం వాటాని త‌మ వాటాగా తీసుకుంటుంద‌ని పంపిణీదారులు తెలిపారు. అయితే ఇప్పుడీ వాటాని దిల్ రాజు స‌హా ప‌లువురు డిస్ర్టిబ్యూట‌ర్లు 5 నుంచి 6 శాతం మ‌ధ్య‌లో తీసుకోమ‌ని కోరుతున్నారుట‌.

`బీఎమ్ ఎస్` కేవ‌లం స్టాప్ వేర్ ప్లాట్ ఫాం అందించ‌డం మిన‌హా పంపిణీదారుల పెట్టుబ‌డితో యాప్ కి ఎలాంటి సంబంధం లేదు. యాప్ వినియోగానికే వినియోగ దారుడి నుంచి అంత మొత్తం ఛార్జ్ చేయాలా? అని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌కు రావాల్సిన షేర్ ని బీఎమ్ ఎస్ తీసుకుంటుంద‌ని దీనిలో మార్పులు చేయాల‌ని పంపిణీదారులు కోరుతున్నారు.

సొంతంగా  థియేట‌ర్లు లేకుండా.. సినిమా తీయ‌కుండా.. సినిమా కొనుక్కోకుండా షేర్ ఎలా తీసుకుంటార‌ని  పంపిణీదారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే బీఎమ్ ఎస్ వాద‌న మ‌రో లా ఉంది. ఒక్క కారు కూడా లేని ఊబ‌ర్ లాంటి క్యాబ్ వ్య‌వ‌స్థ‌లు క్యాబ్ వ్యాపారాన్నే శాషిస్తున్నాయి?  వంటి అంశాల్ని ఉద‌హార‌ణ‌గా చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. 
Tags:    

Similar News