చ‌ర్చ‌లు షురూ..వేత‌నాలు కొలిక్కి వ‌చ్చిన‌ట్టేనా?

Update: 2022-06-24 11:30 GMT
త‌మ క‌నీస వేత‌నాలు పెంచాలంటూ సినీ కార్మికులు బుధ‌వారం మెరుపు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. ఫిల్హ్ ఫెడ‌రేష‌న్ ఈ విష‌య‌మై నిర్మాత‌ల మండ‌లిని సంప్ర‌దించినా ఫ‌లితం లేక‌పోవ‌డం వ‌ల్లే తాము స‌మ్మెకు దిగామంటూ ఫేడ‌రేష‌న్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ  మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ వ‌ద్ద‌కు పంచాయితీ చేర‌డంతో ఇరు వ‌ర్గాలు సామ‌ర‌స్యంగా స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

అంతే కాకుండా ఇరు వ‌ర్గాల్లోనూ స‌మ‌స్య‌లున్నాయ‌ని, వాటిని కూర్చుని ప‌రిష్క‌రించుకోండ‌ని, స‌మ‌స్య‌ని ప్ర‌భుత్వం టేక‌ప్ చేపేంత వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య త‌ల‌సాని వ‌ల్ల చ‌ర్య‌లు స‌ఫ‌లం కావ‌డంతో సినీ కార్మికులు శుక్ర‌వారం నుంచి షూటింగ్ ల‌కు హాజ‌రు కావ‌డం మొద‌లు పెట్టారు.

స‌మ్మెని విర‌మించి నిర‌వ‌ధిక షూటింగ్ ల‌కు హాజ‌ర‌వుతున్నారు. అయితే కార్మికుల క‌నీస వేత‌నాల‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అధ్య‌క్ష‌త‌న ప్రత్యేక స‌మావేశం శుక్ర‌వారం ఫిల్మ్ ఛాంబ‌ర్ లో జ‌రిగింది.

దీనిపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ తో చ‌ర్చ‌లు ప్రారంభించామ‌ని, సంబంధిత వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామన్నారు. ఏరోజు ఏం మాట్లాడుకున్నామో వాట‌న్నింటినీ క్రోడీక‌రించి చివ‌రి రోజు మీడియా ద్వారా అంద‌రికి తెలియ‌జేస్తాం. నేటి నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి.

ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌న్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. నిర్మాత‌ల‌తో చిన్నా పెద్దా అనే తేడా ఏమీ లేదు. ఇక్క‌డున్న 20 మందిలో 12 మంది చిన్న సినిమాలు నిర్మిస్తున్న‌వారే. ఎవ‌రి స‌మ‌స్య‌లు వారికున్నాయి. అన్నింటి గురించి వివ‌రిస్తాం అని తెలిపారు దిల్ రాజు.

గురువారం కార్మిక సంఘాల‌కు, నిర్మాత‌ల మండ‌లికి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే క‌నీస వేత‌నాలు ఎలా నిర్ణ‌యించాలి? ఎంత నిర్ణ‌యించాల‌నే దానిపై దిల్ రాజు అధ్య‌క్ష‌త‌న స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా ఫెడ‌రేష‌న్ తో స‌మావేశ‌మైంది. అయితే స‌మావేశం ముగిసిన త‌రువాత మీడియా ముందుకు వ‌చ్చిన దిల్ రాజు కార్మికుల స‌మ‌స్య‌కు ఎన్ని రోజుల్లో ముగింపు ప‌ల‌క‌బోతున్నారు? .. ఎంత వేత‌నాన్ని నిర్ణ‌యించ‌బోతున్న‌ది మాత్రం స్ప‌ష్టం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News