ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా? అని ఓ సినిమాలో బాలకృష్ణ అన్నట్టుగా వుంది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిస్థితి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ ఆయనకున్న పేరు ప్రత్యేకం. సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ గా ఆయన ట్రాకే సెపరేట్. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇందు కోసం ఆయన చేసిన ప్రయత్నం ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా మారి బాలీవుడ్ ఆశలకు బిగ్ ఝలకిచ్చింది.
బాలీవుడ్ లోనూ తన సత్తా చాటలని దిల్ రాజు తెలుగు సినిమా రీమేక్ తో ప్రయోగం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన చిత్రం `జెర్సీ`. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో రెండు పురస్కారాలని సొంతం చేసుకున్న ఈ మూవీ అయితే తన బాలీవుడ్ ఎంట్రీకి కరెక్ట్ అని భావించి ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. షాహీద్ కపూర్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.
తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ రీమేక్ ని డైరెక్ట్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో బాలీవుడ్ నిర్మాత అమల్ గిల్ తో కలిసి దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు. తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ మూవీ బాలీవుడ్ లోనూ అంతకు మించిన విజయాన్ని సాధిస్తుందని కాన్ఫిడెంట్ తో కనిపించారు.
అంతే కాకుండా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలని సాధిస్తున్న నేపథ్యంలో సౌత్ రీమేక్ ఆధారంగా రూపొందిన `జెర్సీ` కాసుల వర్షం కురిపిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అంచనాలు తలకిందులు చేసింది `జెర్సీ`. ఏప్రిల్ 22న విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నిరాశ పరిచింది. ఈ సినిమాకు `కేజీఎఫ్ 2` భారీ దెబ్బకొట్టింది. ప్రేక్షకులు మాసీవ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడుతున్న నేపథ్యంలో `జెర్సీ` లాంటి సాఫ్ట్ మూవీని చూడటానికి ఆసక్తిని చూపించకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయింది. ఊహించని విధంగా `జెర్సీ` డిజప్పాయింట్ చేయడంతో దిల్ రాజు బాలీవుడ్ ఆశలు ఆవిరయ్యాయని అంటున్నారు.
ప్రస్తుతం దిల్ రాజు మరో తెలుగు హిట్ ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో విశ్వక్ సేన్ హీరో గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `హిట్ : ద ఫస్ట్ కేస్` చిత్రాన్ని రాజ్ కుమార్ రావు హీరోగా దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇదే కాకుండా `ఎఫ్ 2`ని సాజిద్ నదియా వాలాతో కలిసి రీమేక్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలైనా దిల్ రాజుకు బాలీవుడ్ లో హిట్టిచ్చేనా? .. వేచి చూడాల్సిందే.