ఎప్పుడూ లాజిక్ లు చెప్పే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారబ్బా అనే కామెంట్ లు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ భారీ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని తెలుగులో `వారసుడు`గా, తమిళంలో `వారీసు`గా ఈ సంక్రాంతికి రెండు భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
పేరుకు తమిళ సినిమా అయినా ఇది బైలింగ్వల్ అంటూ ముందు ప్రచారం చేశారు. ఇటీవల టాలీవుడ్ షూటింగ్ ల బంద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మెగాస్టార్ సినిమా నుంచి ప్రతీ చిన్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ దిల్ రాజు .. విజయ్ తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ఇదే విషయాన్ని మీడియాతో పాటు పలువురు ప్రొడ్యూసర్లు దిల్ రాజుని నిలదీశారు. దీంతో ఈ మూవీ కేవలం తమిళ సినిమా అని, అందుకే షూటింగ్ చేస్తున్నామని దిల్ రాజు అసలు సీక్రెట్ బయటపెట్టాడు.
అలా బయటపెట్టిన దిల్ రాజు ఇప్పడు అడ్డంగా దొరికిపోయాడు. గతంలో తెలుగు సినిమాలు పండగ సీజన్ లో రిలీజ్ అయిన క్రమంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడం సాధ్యం కాదని వాదించిన దిల్ రాజు మరి ఆ విషయాన్ని విజయ్ తో నిర్మిస్తున్న `వారసుడు` విషయంలో ఎందుకు మర్చిపోయారో అర్థం కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు దిల్ రాజుపై మండిపడుతున్నారట. గతంలో దిల్ రాజు డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఇవ్వడం కుదదని చెప్పిన క్రమంలో ఓ నిర్మాత దిల్ రాజుపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
గతంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడం కుదరదని చిందులు తొక్కిన దిల్ రాజు ఇదిలా వుంటే ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు మెగాస్టార్ నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`, బాలకృష్ణ నటిస్తున్న `వీరసింహారెడ్డి`, ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` పోటా పోటీగా రిలీజ్అవుతున్న వేళ తమిళ సినిమా `వారసుడు`ని దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం ఇప్పడు చర్చనీయాంశంగా మారుతోంది. ఈ మూడు సినిమాలతో పాటు అజిత్ `తునీవు` కూడా ఇదే సమయంలో రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఇలా తెలుగు సినిమాలకు థియేటర్ల పరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొనే ప్రమాదం వున్న నేపథ్యంలో థియేట్ల కోసం తీవ్ర గందరగోళం.. నిర్మాతల మధ్య ప్రధాన థియేటర్ల కోసం కొడవలు జరిగే ప్రమాదం వుంది. ఈ విషయాన్ని తెలిసీ తెలిసి దిల్ రాజు ఈ విషయం ఎలా మర్చిపోయారబ్బా? అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో అన్న మాటని పక్కన పెట్టిన దిల్ రాజు అంతా నా ఇష్టం అన్నట్టుగా మెయిన్ థియేటర్లని తన సినిమా `వారసుడు`కే కేటాయించుకుంటాడా? లేక తెలుగు సినిమాలకు కూడా ఇచ్చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.