టాలీవుడ్ లో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ సినిమాతో నిర్మాతగా కెరియర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా దిల్ రాజు మారిపోయాడు. మిగిలిన నిర్మాతలకి భిన్నంగా దిల్ రాజు సినిమాల నిర్మాణం గాని, కథల ఎంపిక గాని ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే.
రైటింగ్, డైరెక్టర్స్ టీమ్ ని ఏర్పాటు చేసుకొని వారిలో నుంచే బెస్ట్ స్టొరీని ఇచ్చే వారిని దర్శకులుగా టాలీవుడ్ ని పరిచయం చేసిన ఘనత దిల్ రాజు సొంతం.ఆర్య సినిమాతో సుకుమార్ ని, భద్ర మూవీతో బోయపాటి శ్రీను, మున్నాతో వంశీ పైడిపల్లి. బొమ్మరిల్లు సినిమాతో భాస్కర్, కొత్త బంగారు లోకం సినిమాతో శ్రీకాంత్ అడ్డాల లాంటి ఎంతో మంది దర్శకులని దిల్ రాజు టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఇలా పరిచయం అయిన వారిలో ప్రస్తుతం స్టార్ దర్శకులిగా ఉన్నవారు కూడా ఉన్నారు. దిల్ రాజు సినిమా అంటే కుటుంబం అంతా కలిసి వెళ్లి హాయిగా చూసి ఆనందించే చిత్రం అనే అభిప్రాయం ప్రేక్షకుడిలో ఉంది.
ఎక్కువగా కుటుంబ కథాచిత్రాలకి ప్రాధాన్యత ఇస్తూ, బంధాల చుట్టూ కథలని రిప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులకి అందిస్తూ ఉంటారు. అలా వచ్చి చాలా సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఒక బొమ్మరిల్లు, ఒక బృందావనం, శతమానం భవతి, ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు దిల్ రాజుకి డబ్బులు తెచ్చిపెట్టిన సినిమాలు అన్ని కూడా ఫ్యామిలీ అండ్ లవ్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కాయి.
అయితే ఫ్యామిలీ ఎమోషనల్ సెటిల్డ్ గా చూపిస్తే ఒక శతమానం భవతి అవుతుంది. అది కాస్తా శృతి మించితే ఒక శ్రీనివాస కళ్యాణం అవుతుంది అనే విషయం ప్రేక్షకులు ఇచ్చిన రిజల్ట్ తోనైనా దిల్ రాజు అర్ధం చేసుకొని ఉండాల్సింది. అయితే ఈ మధ్యకాలంలో దిల్ రాజు టేస్ట్ పూర్తిగా దారితప్పుతుంది అనే మాట వినిపిస్తుంది. నిర్మాతగా 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎఫ్2 మాత్రమే దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.
వకీల్ సాబ్ సినిమాకి హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ రాలేదు. ఇక మిగిలిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. దీనికి కారణంగా ఈ సినిమాలలో చాలా వరకు అవుట్ డేటెడ్ కథలని ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేయడమే.
తాజాగా వచ్చిన వారసుడు సినిమాతో కూడా మరోసారి కుటుంబ బంధాలు, ఆప్యాయతలు అంటే శృతిమించిన ఎమోషనల్ డ్రామాని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఇలాంటి కథలని తెలుగు ప్రేక్షకులు చూసి చూసి విసిగిపోయారు. దీంతో వారసుడు సినిమాకి ఫుల్ డివైడ్ గా వస్తుంది. అయితే నాలుగేళ్లలో 10 ఫ్లాప్ లు వచ్చిన కూడా దిల్ రాజు పెద్దగా నష్టాలు ఎదుర్కోకపోవడానికి కారణం ముందుగానే అతని సినిమాలు థీయాట్రికల్ అమ్మేయడమే అనే మాట వినిపిస్తుంది.