మొన్న విడుదలైన బాలీవుడ్ మల్టీ స్టారర్ కళంక్ ఫలితం తేలిపోయింది. మొదటి రోజు మంచి వసూళ్ళను రాబట్టినా టాక్ పాజిటివ్ గా లేకపోవడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. కనీస అంచనాలు అందుకోలేదని క్రిటిక్స్ దుమ్మెత్తిపోశారు. దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాత కరణ్ జోహార్ కు నష్టాలు ఖాయమని తేలిపోయింది. వరుణ్ ధావన్-అలియ భట్-సంజయ్ దత్-మధురి దీక్షిత్ క్రేజీ కాంబినేషన్ ఖరీదైన సెట్లు విజువల్ ఎఫెక్ట్స్ ఇవేవి కాపాడలేకపోయాయి.
గత ఏడాది సరిగ్గా ఇదే తరహాలో అడ్రెస్ లేకుండా పోయిన తగ్స్ అఫ్ హిందూస్తాన్ ని ఈ సందర్భంగా జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడీ రిజల్ట్ కరణ్ జోహార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా టెన్షన్ పడేలా చేస్తోంది. అందులో మొదటిది బ్రహ్మాస్త్ర. మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ హై బడ్జెట్ మల్టీ స్టారర్ లో మన కింగ్ నాగార్జున కూడా ఓ కీలక పాత్ర చేశాడు. అలియా భట్ ఇందులోనూ ఉంది. దీని తర్వాత తక్త్ అనే మరో మూవీ కూడా ప్లానింగ్ లో ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ రెండు సినిమాల మీద సుమారుగా 300 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్టుగా ముంబై టాక్. సో ఇంత రిస్క్ చేస్తున్న కరణ్ జోహార్ కు ఇవి విడుదలయ్యే దాకా నిద్రలేని రాత్రులే ఎక్కువగా ఉంటాయేమో. తన కెరీర్ ప్రారంబంలో తప్ప ఇంత భారీ స్థాయిలో కరణ్ జోహార్ లో మల్టీ స్టారర్లు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. సహ నిర్మాతలు ఉన్నప్పటికీ అధిక భారం కరణ్ మీదే ఉందట. అందుకే బ్రహ్మాస్త్ర-తక్త్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. అయినా ఇదంతా ఏదో బాహుబలిని బీట్ చేయాలనే తాపత్రయం తప్ప ఇంకోటి కనిపించడం లేదు