దేశాల మధ్య వార్ నేపథ్య సినిమాలు.. వీరుల బయోపిక్ చిత్రాలకు నిరంతరం గొప్ప ఆదరణ దక్కుతోంది. దేశభక్తి.. వీరత్వంపై సినిమాలకు బాక్సాఫీస్ షేకవ్వడం భారతదేశంలో ఈ జానర్ ఆదరణకు నిదర్శనం.
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వేళ విడుదలైన రెండు వార్ బేస్డ్ బయోపిక్ చిత్రాలు `గుంజన్ సక్సేనా: 2020 లో కార్గిల్ గర్ల్ ` .. షేర్ షా (2021) భారీ విజయం సాధించిన తరువాత నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు తన మూడవ వారియర్ బయోపిక్ కి సన్నాహకాల్లో ఉన్నారు స్వాతంత్య్ర సమరయోధురాలు ఉషా మెహతా జీవితంపై సినిమా తీయాలన్నది ఆయన ప్లాన్.
కరణ్ జోహార్ కు అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరణ్ తన స్వాతంత్య్ర దినోత్సవ చిత్రాలను నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రతి సంవత్సరం ఒక పొగడ్తలాగా... జాతీయ హీరో గురించిన ఒక చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన నాలో ఉంది. భారతీయ తొలి ఎయిర్ ఫోర్స్ పైలట్ కథతో `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` ను నిర్మించినప్పుడు ఈ వార్ ఒక్కసారిగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2021 లో `పరమవీర చక్ర` విజేత విక్రమ్ బాత్రా `షేర్షా` చిత్రాన్ని చేశాం. ఈ సినిమాకి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడు జాతీయ హీరో ఉషా మెహతాపై మూడవ చిత్రం చేస్తున్నాను అని తెలిపారు.
2013 లో ఏక్ తి దయన్ కు దర్శకత్వం వహించిన కన్నన్ అయ్యర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇతర సైనికులు యుద్ధ వీరులు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు .. విజయాలకు సంబంధించిన కథల్ని సేకరించేందుకు వేట కొనసాగుతోంది అని కరణ్ సన్నిహితులు వెల్లడించారు.
నిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నం మంచి మార్పును కోరుతోంది. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కే రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాలు ఇతర సామాజిక వ్యతిరేక డ్రామాల నుంచి బయటపడేందుకు ఇలాంటి బయోపిక్ లు సహకరిస్తున్నాయని భావించాలి. ఇది కొంతకాలం పాటు కొనసాగే సీజన్ అని భావించలేం. నిరంతరం కొనసాగే యజ్ఞంగా భావించవచ్చు.