కరణ్ జోహార్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకనిర్మాతలలో ఒకరు. అతడు చాలా మంది కొత్త ముఖాలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2012లో స్వీయదర్శకత్వంలో నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో అలియా భట్- వరుణ్ ధావన్- సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి యువతరం నటీనటుల్ని పరిచయం చేసాడు. ముగ్గురు నటీనటులు అరంగేట్రం విజయం అందుకున్నారు. అనంతరం ఎవరికి వారు స్వయంకృషితో స్టార్లుగా ఎదిగారు.
కానీ ఆ డెబ్యూల సినిమాతో కరణ్ జోహార్ ఎదుర్కొన్న కష్టం ఎవరికీ తెలీదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డెబ్యూ తారల సినిమాతో డబ్బును ఎలా పోగొట్టుకున్నాడో వెల్లడించాడు. కరణ్ జోహార్ ఇటీవల మాస్టర్స్ యూనియన్ తాలూకా బిజినెస్ ఆఫ్ బాలీవుడ్ పోడ్ కాస్ట్ లో ఈ చిత్రం ఎలా విడుదలైందో విజయం సాధించినా తాను ఎలా నష్టపోయాడో వెల్లడించాడు. అయితే బడ్జెట్ పై అదనపు ఖర్చులను తిరిగి పొందలేకపోవడానికి కారణం.. సినిమాని ప్రమోట్ చేయడంతో పాటు ఇతర అంశాలు ఖర్చు ని పెంచాయని తెలిపారు.
కొన్నిసార్లు అవగాహన తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేశాను. కానీ అవి ఆర్థికంగా బాగా రాణించలేదు!! అని కరణ్ జోహార్ అన్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం హిట్టయినా కానీ తనకు నష్టాలు తప్పలేదని అంగీకరించాడు. ఈ చిత్రం రూ.70 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని కరణ్ గుర్తు చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు వసూలు చేసి ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టింది. కానీ ఆ సినిమా కోసం పిచ్చిగా ఖర్చు చేశాను. ఆ సినిమాతో 15-20 కోట్లు నష్టపోయాను.. అని తెలిపారు.
అయితే నటీనటులు తమ కెరీర్ లో అభివృద్ధి చెందుతారని ఆరోజు ఊహించానని కరణ్ చెప్పాడు. ధర్మ ప్రొడక్షన్స్ ఒక్కో స్టార్ తో మూడు సినిమాల ఒప్పందాలు చేసుకుంది. హసీ తో ఫేసీ- హంప్టీ శర్మ కీ దుల్హనియా- 2 స్టేట్స్ తర్వాత బడ్జెట్ లు సబ్సిడీ సంఖ్యల క్రమంలో ఉన్నాయి. ఎందుకంటే అది మా ఒప్పందం ప్రకారం చివరికి లోటును పూడ్చేలా ప్రతిదీ డిజైన్ చేసుకున్నానని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు కరణ్. అంటే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో నష్టపోయినదానిని పూడ్చుకునేందుకు స్టార్లతో చేసుకున్న మూడు సినిమాల ఒప్పందం తనను కాపాడిందన్నమాట.
అలియా భట్ హంప్టీ శర్మ కీ దుల్హనియా- 2 స్టేట్స్- బద్రీనాథ్ కి దుల్హనియా- డియర్ జిందగీ - కళాంక్ సహా పలు ధర్మ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ లలో నటించింది. వరుణ్ ధావన్ హంప్టీ శర్మ కీ దుల్హనియా- బద్రీనాథ్ కి దుల్హనియా- కళాంక్ - జుగ్ జగ్ జీయో చిత్రాలకు ధర్మ సంస్థతో కలిసి పనిచేశారు. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా హసీ తో ఫాసీ- బ్రదర్స్- బార్ బార్ దేఖో- షేర్షా లాంటి చిత్రాల్లో నటించారు. ఇవన్నీ ధర్మ సంస్థ నుంచి వచ్చినవే. తదుపరి ధర్మ ప్రొడక్షన్స్ లోనే యోధా అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటిస్తున్నాడు.
కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ఆలియా నటిస్తోంది. రణవీర్ సింగ్- ధర్మేంద్ర- జయా బచ్చన్- షబానా అజ్మీ లాంటి టాప్ స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రం 2023 ఏప్రిల్ లో విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.