బాలీవుడ్ డ్రగ్స్ లో నిర్మాత మధు మంతెన పేరు జాతీయ మీడియాలో హైలైట్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. జయ సాహా డ్రగ్ చాట్స్ లో మధు మంతెన పేరు వెలుగు చూడడంతో సమన్లు అందుకున్న ఆయన నేడు ఎన్.సి.బి ముందు విచారణకు హాజరైన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఎన్.సి.బి విచారణలో మధు మంతెనకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు జయసాహా ఒప్పుకున్నారని జాతీయ మీడియాలు చెబుతున్నాయి. దీంతో మధు మంతెన.. జయసాహా ఇరువురినీ ఒకేచోట చేర్చి ఎన్.సి.బి విచారించిందని కథనాలు వెల్లడిస్తున్నాయి.
మధు మంతెన టాలీవుడ్ బాలీవుడ్ లో సుపరిచితుడైన నిర్మాత. గజిని చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి బాలీవుడ్ లో రీమేక్ చేశారు. క్వీన్ - ఉడ్తా పంజాబ్- సూపర్ 30 వంటి బ్లాక్ బస్టర్లను ఆయన నిర్మించారు. బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాకు క్వాన్ మేనేజ్ మెంట్ కంపెనీ కేంద్రంగా మారిందని.. క్వాన్ తో సంబంధీకుడైన మేనేజర్ జయా సాహాతో సంబంధాల నేపథ్యంలోనే మధు మంతెన పై తాజా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ విచారణలో ఆయన ఏం చెప్పారన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
క్వాన్ తో సంబంధం ఉన్న దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ .. అలానే సుశాంత్ మాజీ ట్యాలెంట్ మేనేజర్ జయ సాహాల విచారణలో పలు బిగ్ షాట్స్ పేర్లు వెల్లడయ్యాయన్న లీకుల్ని బాలీవుడ్ మీడియా కథనాలుగా వండి వారుస్తోంది. ఈ ఏజెన్సీతో సల్మాన్ ఖాన్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన లాయర్ ఖండించిన సంగతి విధితమే.