ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో .. ఆ సినిమాని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడం కూడా అంతే కష్టంగా మారింది. ఈ రెండు విషయాల్లోనూ మేకర్స్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా సినిమా ప్రయోషన్స్ ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఎలా చేస్తే తమ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్ లభిస్తుందో దాన్నే ప్రధానంగా ఎంచుకుంటూ ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.
`RRR` ప్రమోషన్స్ తో ఒక సినిమాని ఏ స్థాయిలో.. ఏ ఏ విధంగా..ఏఏ రంగాల్లో ప్రమోట్ చేయెచ్చో రాజమౌళి చేసి చూపించారు. ప్రతీ రంగాన్ని `RRR` ప్రమోషన్స్ కోసం వాడుకున్నారు. చివరికి ప్రో కబడ్డీ లైవ్ డిబేట్ ని కూడా రాజమౌళి `RRR` ప్రమోషన్స్ కు ఉపయోగించుకుని అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇప్పడు ఓ ప్రొడ్యూసర్ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో కంటెంట్ వున్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో మేకర్స్ తమ సినిమా కాన్సెప్ట్ ని పరిచయం చేస్తూ కొత్త తరహా ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతున్నారు.
అయితే నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఏకంగా తన సినిమా పోలీస్ కథాంశంతో రూపొందడంతో పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ప్రయోషన్స్ లో పాల్గొంటూ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన లేటెస్ట్ మూవీ `అల్లూరి`. ఫిక్షనల్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా శ్రీవిష్ణు నటించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ ని గురువారం నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రారంభించారు. హైదరాబాద్ లో గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశానికి పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో రావడంతో అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 3 న వైజాగ్ లో అల్లూరి సీతారామరాజు సమాధి నుంచి `అల్లూరి` టీమ్ యాత్రని ప్రారంభించబోతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు ఈ ప్రమోషనల్ యాత్ర జరగబోతోంది.
ఈ మూవీ ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కింది. ఇందులో హీరో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అయితే ఆ విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం స్వయంగా నిర్మాత కూడా పోలీస్ వేషం వేసుకుని ప్రమోట్ చేస్తుండటంతో కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ప్రొడ్యూసర్ కూడా వేషం వేయాల్సిన సిట్యువేషన్ కి టాలీవుడ్ వచ్చిందని కామెంట్ లు చేస్తున్నారు. మరి తాజా ట్రెండ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి అని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.