పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది. పవన్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం మూడు ఉన్నాయి. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కాగా రెండవది హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతుంది. అవి కాకుండా క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. హరిహర వీరమల్లు టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా పై మిగిలిన రెండు సినిమాల కంటే ఎక్కువగా ఆసక్తి ఉంది.
పవన్ కళ్యాణ్ మొదటి సారి ఒక పౌరాణిక సినిమా లో కనిపించబోతున్నాడు. అదీ కాకుండా ఒక దొంగ పాత్రలో పవన్ ను క్రిష్ చూపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయితే అయ్యింది.. కాని ఎంత వరకు షూట్ అయ్యింది.... ఎప్పటి వరకు పూర్తి అవుతుందనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. ఎట్టకేలకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి సినిమా అప్ డేట్ అధికారికంగా రావడంతో అభిమానులు సూపర్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం ఇటీవల మాట్లాడుతూ.. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయ్యింది. ఏప్రిల్ మొదటి వారం వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. పవన్ కరోనా బారిన పడటంతో షూటింగ్ నిలిచి పోయింది. మళ్లీ పవన్ షూటింగ్ కు సిద్దంగా ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. మళ్లీ సినిమా ను లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే పునః ప్రారంభించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. దాంతో పాటు బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు కూడా ఈ సినిమాలో ఉన్నట్లుగా ఆయన స్పష్టంగా చెప్పేశాడు. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో కనిపించబోతుండగా.. జాక్వెలిన్ ఒక యువరాణి పాత్రలో కనిపించబోతుంది.