నయన్ ఓకే.. నిర్మాత ఓకే.. సమస్య ఎవరికి?

Update: 2016-07-04 10:45 GMT
నయనతార వెర్సస్ నిర్మాతలు.. ఎప్పట్నుంచో ఉన్న కాన్సెప్టే. స్వయంగా రామానాయుడు లాంటి అగ్ర నిర్మాత నయన్ ను ఉద్దేశించి ఓసారి విమర్శలు గుప్పించారు. హీరోయిన్లు ప్రమోషన్లకు రాననడం అన్యాయమంటూ నయనతారను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడా కొందరు తమిళ-తెలుగు నిర్మాతలు నయనతారపై ఫిర్యాదులు చేశారు. అయినా ఆమెలో ఏ మార్పూ రాలేదు. ఒప్పందాన్ని దాటి అదనంగా డేట్లివ్వడం.. కాస్త లేటైనా సర్దుకుపోవడం.. ప్రమోషన్లకు రావడం.. లాంటివేమీ చేయలేదు నయన్. ఈ నేపథ్యంలోనే నయన్ వల్ల ‘బాబు బంగారం’ నిర్మాత తెగ ఇబ్బంది పడిపోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. మామూలుగా తనపై వచ్చే విమర్శలపై నయన్ స్పందించదు కానీ.. ఈసారి మాత్రం ఓపెనైపోయింది. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదన్నట్లు వివరణ ఇచ్చింది. ఈ చిత్ర యూనిట్ మీదే విమర్శలు గుప్పించింది.

ఐతే నయన్ ఇలా స్పందించడం హాట్ టాపిక్ కావడంతో ‘బాబు బంగారం’ సమర్పకుడు ఎస్.రాధాకృష్ణ లైన్లోకి వచ్చాడు. అసలు నయనతారతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. నయన్ వల్ల తకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని.. ఆమె చాలా ప్రొఫెషనల్ అని.. సినిమా అనుకున్న ప్రకారమే పూర్తయిందని ఆయన వివరణ ఇచ్చారు. ఐతే నయనతారే స్వయంగా.. షూటింగ్ అనుకున్న ప్రకారం పూర్తవలేదని.. తాను అదనంగా డేట్లు ఇవ్వాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. మరి రాధాకృష్ణ ఏమో ఆమె వల్ల ఏ ఇబ్బందీ లేదంటున్నాడు. షూటింగ్ అనుకున్న ప్రకారమే పూర్తయిందంటున్నాడు. మరి నిర్మాతకే ఇబ్బంది లేనపుడు.. అసలీ వివాదం ఎందుకు తెరమీదికి వచ్చిందన్నది అర్థం కాని విషయం.
Tags:    

Similar News