చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయని తెలిసినా.. ప్రస్తుతం జరుగుతున్న ఓ పరిస్థితిని మాత్రం చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. స్టార్ హీరోలు 10.. 20 కోట్లు.. అంతకు మించి కూడా పారితోషికం పుచ్చుకుంటున్నారు. హీరోయిన్లయితే కోటి నుంచి 2.5 కోట్ల వరకూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
ఓ స్థాయికి చేరుకున్న దర్శకులు కూడా 6 నుంచి 12 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ తో రూపొందిన హిట్ అయితే బాధేమీ లేదు. కానీ ఫ్లాప్ అయిన తర్వాత పరిస్థితులను చూస్తే.. ఇలా కోట్లు పుచ్చుకున్న వారెవరికీ ఏమీ తేడా రావడం లేదు. సింపుల్ గా తర్వాతి సినిమాపై దృష్టి పెడుతున్నారంతే. కానీ వీళ్లందరికీ కోట్లు కోట్లు కుమ్మరించిన నిర్మాతలు మాత్రం రోడ్డు మీదకు వచ్చేస్తున్నారు. ఆయా ఏరియాల రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటోంది.
ఈ నిర్మాతలు ఇచ్చిన కోట్లతో స్టార్లు.. డైరెక్టర్లు విల్లాలు కొనుక్కుంటూ.. లగ్జరీ కార్ల షాపింగ్ చేసుకుంటున్నారు. అదే మూవీతో నిర్మాత మాత్రం నిలువునా మునిగిపోవాల్సి వస్తే.. అందులో నటించిన వారు.. పని చేసిన వారి లైఫ్ కి మాత్రం ఎలాంటి డిఫరెన్స్ రావడం లేదు. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదని.. నిర్మాతలు వాపోతున్నారు. 2017లోనే ఇప్పటివరకూ నిర్మాతలు 150 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నరని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. డిజాస్టర్ల కారణంగా చాలా మంది నిర్మాతలు.. నిర్మాణం నుంచి తప్పుకోవాల్సి వస్తోంది.
స్టార్లతో మూవీస్ తీసే ఓ నిర్మాత తన ప్యాలెస్ అమ్ముకోవాల్సి వస్తే.. మరో భారీ నిర్మాత ఇప్పుడు చిన్న హీరోలతో మూవీస్ చేసుకుంటున్నాడు. మరొకాయన అప్పులవాళ్లకు కనిపించకుండా దాక్కోవాల్సి వస్తోంది. ఇలాంటి చిత్రమైన చిత్రాలకు చెక్ పెట్టాలనే డిమాండ్స్ వినిపిస్తున్నా కానీ.. సొల్యూషన్ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.