థియేట‌ర్లు తెర‌వాలా.. నిర్మాత‌ల‌కు ఇంట్రెస్ట్ లేద‌ట‌

Update: 2020-11-25 01:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ ఇంకా దేశంలో ప్ర‌వేశించ‌క ముందే ఆయ‌న సినిమా స‌న్నివేశం గ్ర‌హించేశారు. ఇలా ప్ర‌వేశించి గ‌డ‌బిడ మొద‌ల‌వ్వ‌గానే ఎగ్జిబిష‌న్ రంగం ఇక కుదేలైన‌ట్టేన‌ని అన్నారు. మ‌హ‌మ్మారీ విజృంభిస్తున్న క్ర‌మంలో ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెర‌వ‌డం సుర‌క్షితం కాద‌ని విశ్లేషించారు. తెరిచినా జ‌నం రార‌ని కూడా ముందే చెప్పేశారు. మొత్తానికి ఆయ‌న అనాలిసిస్ ఎక్క‌డా ఫెయిల్ కాలేదు. ముందే ఆయ‌న చెప్పిన‌ట్టే అంతా అయ్యింది. ఇక ప్ర‌భుత్వాలు 50 శాతం ఆక్యుపెన్సీతో థియ‌ట‌ర్లు తెరుచుక‌నేందుకు అనుమ‌తించినా తాను మాత్రం థియేట‌ర్లు ఓపెన్ చేయ‌న‌ని ఖ‌రాకండిగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీదున్నారు.

నిన్న‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సినీప‌రిశ్ర‌మ‌కు వ‌రాలిస్తూ థియేట‌ర్లు తెరిపించుకునేందుకు జీవోని ఇస్తున్నామ‌న్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పటికీ నిర్మాత‌లు ఇందుకు సుముఖంగా లేర‌న్న‌దే బ్యాడ్ న్యూస్. థియేట‌ర్లు తెరిచి 50శాతం ఆక్యూపెన్సీతో టిక్కెట్లు అమ్మితే తాము న‌ష్ట‌పోతామ‌ని నిర్మాత‌లు ఎగ్జిబిట‌ర్లు కూడా భావిస్తున్నార‌ట‌.

50 మంది వ‌చ్చినా 100 మంది వ‌చ్చినా అదే ఖ‌ర్చు మెయింటెనెన్స్ కి. అలాంట‌ప్పుడు థియేట‌ర్లు తెరిచి నిర్వాహ‌ణ వ్య‌యం భారాన్ని మోయ‌లేమ‌నేది వీళ్ల వెర్ష‌న్. అందుకే థియేట‌ర్లు తెరిపించినా వృథానే అనే ఉద్ధేశంలో ఉన్నారు. 75 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు ర‌న్ అయితే ఓకే. కానీ స‌గం జ‌నాల‌తో క‌ష్టం అనేస్తున్నారు. ఇక పెద్ద సినిమాలు రిలీజైతే ఆల్మోస్ట్ డ‌బుల్ ఛార్జ్ వ‌సూలు చేస్తేనే వ‌ర్క‌వుటవుతుంద‌న్న భావ‌నా ఉంది. మ‌రి వీట‌న్నిటికీ సొల్యూష‌న్ ఉందా లేదా? అన్న‌ది చూడాలి. ఇక తొలి నుంచి డి.సురేష్ బాబు చెప్పిందే అవుతోంది. ఇక థియేట‌ర్లు తెరిచే విష‌యంలో ఆయ‌న స‌ల‌హా తీసుకుని ప‌రిశ్ర‌మ ఇక‌పైనా ముందుకు వెళితే మంచిదేమో!
Tags:    

Similar News