ప్రొడ్యూసర్స్ వాటి మీద రెంట్లు మినహాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారా...?

Update: 2020-05-20 16:08 GMT
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనియున్న పరిస్థితుల వల్ల గత రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి.. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి.. సినిమా విడుదలలు ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు గడ్డు కాలాన్ని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే ఫైనాసియర్స్ దగ్గర తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అని ఆలోచించిన నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లకు సిద్ధ పడుతున్నారు. కొంతమంది మాత్రం పరిస్థితులు చక్కబడిన తర్వాత బిగ్ స్క్రీన్ మీద తమ చిత్రాలను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా షూటింగులకు అనుమతిస్తే వెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే వీరికి ఇప్పుడున్న సమస్యలతో పాటు సెట్స్ కి చెల్లించే రెంట్లు కూడా పెద్ద తలనొప్పులుగా మారాయంట.

లాక్ డౌన్ విధించే సమయానికి చాలా సినిమాలు పెద్ద పెద్ద సెట్స్ వేసి చిత్రీకరణ చేస్తున్నారు. సడన్ గా క్రైసిస్ ఏర్పడటంతో అర్థాంతరంగా షూటింగ్స్ నిలుపుదల చేసుకున్నారు. కానీ అప్పటికే సెట్స్ కోసం వారు కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. అయితే రెండు నెలల నుండి సెట్స్ లో చిత్రీకరణ జరగలేదు. కానీ స్టూడియోలలో నిర్మించిన సెట్స్ కి రెంట్స్ అయితే చెల్లించాలి. ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. షూటింగ్స్ అనుమతి లభించలేదు. అంతేకాకుండా రాబోయేది వర్షాకాలం. దీంతో ఆ సెట్స్ మరమ్మత్తులకు కూడా నిర్మాతలు భరించాల్సి ఉంటుంది. అంటే దాదాపు నాలుగు నెలలు సెట్స్ కి రెంట్లు చెల్లిస్తూ మళ్ళీ వాటి రిపైర్స్ కూడా చేపించుకోవాలన్నమాట. అంటే నిర్మాతకి ఇది మరో భారమనే చెప్పాలి. అందుకోసం కొంతమంది నిర్మాతలు ఈ సెట్స్ మీద రెంట్లు మినహాయించాలని స్టూడియోలను కోరుతున్నారట.

ఇక బాలీవుడ్ విషయానికొస్తే ముంబైలో ఫిల్మ్ సిటీ ల్యాండ్స్ ని వాస్తవానికి ప్రభుత్వం నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఈ స్టూడియోలో కంగనా రనౌత్‌ 'తలైవి' కోసం మేకర్స్ 5 కోట్ల ఖర్చుతో సెట్లను నిర్మించారని సమాచారం. అంతేకాకుండా సంజయ్ లీలా భన్సాలీ అలియా భట్‌ తో తీస్తున్న 'గంగూబాయి' చిత్రం కోసం 19 కోట్ల విలువైన భారీ కామతీపుర సెట్ నిర్మించారట. అయితే గత రెండు నెలలుగా ఇక్కడ షూటింగ్స్ జరగలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ గత రెండు నెలల నుండి ఈ సెట్లలో షూటింగ్ చేయనందున అద్దె మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. రాబోయే వర్షాకాలంలో మరో 3 నెలలు షూటింగ్ చేసే అవకాశాలు లేని కారణంగా సెట్లను రిపేర్ చేయడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వం మొత్తం అద్దెను పూర్తిగా మాఫీ చేయాలని వారు కోరుతున్నారు. ఇది ఒక్క బాలీవుడ్ కే పరిమితం కాలేదు. ఈ సమస్య అన్ని ఇండస్ట్రీలలో నిర్మాతలకు ఉందని సమాచారం.
Tags:    

Similar News