`ట‌క్ జ‌గ‌దీష్` రిలీజ్ పై నిర్మాత‌ల డ్ర‌మ‌టిక్ సారీ..!

Update: 2021-08-22 08:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే థియేట్రికల్ విడుదల కోసం వేచి చూడాల‌ని.. అక్టోబర్ వరకు ప్రత్యక్ష OTT విడుదలను వాయిదా వేయాల‌ని తెలుగు సినిమా నిర్మాతలను తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ కోరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓటీటీ రిలీజ్ ని నాని వ్య‌తిరేకించారు. ట‌క్ జ‌గ‌దీష్‌ ద‌ర్శ‌క హీరోలు నిర్మాత‌ల‌పై అలిగార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) ఓటిటి ప్లాట్ ఫామ్ లపై సినిమాలను విడుదల చేయవ‌ద్ద‌నే డిమాండ్ వ‌ల్ల చాలామంది నిర్మాత‌లు వేచి చూసే ధోర‌ణితో ఉన్నారు. టిఎఫ్ సిసి- తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సైతం హడావిడి డిజిటల్ విడుదలలపై తమ నిరాశను వ్యక్తం చేశాయి. సెప్టెంబర్ 10 న డైరెక్ట్ డిజిటల్ విడుదలను ఎంచుకున్నందుకు నాని టక్ జగదీష్ మేకర్స్ ని కూడా వారు నిందించారు.అదే రోజున థియేట్రికల్ రిలీజ్ కు ఉద్దేశించిన `లవ్ స్టోరీ`తో పోటీని నిలువ‌రించాలని అభ్యర్థించారు.

అక్టోబర్ వరకు ప్రత్యక్ష OTT విడుదలను ఎంచుకోవద్దని నిర్మాతలను కోరాము. అయితే టక్ జగదీష్ నిర్మాతలు థియేట్రికల్ విడుదలను వ‌ద్ద‌నుకున్నారు. డైరెక్ట్ డిజిటల్ విడుదలతో ముందుకు సాగుతున్నారు. డిజిటల్ విడుదలలు థియేటర్ వ్యాపారాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అనేక మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందో మీకు తెలుసు. సెప్టెంబర్ 10 న థియేటర్లలో లవ్ స్టోరీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే టక్ జగదీష్ కూడా అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నట్లు మాకు తెలిసింది. మేము OTT ప్లాట్ ఫారమ్ లకు వ్యతిరేకం కానప్పటికీ ట‌క్ జగదీష్ నిర్మాతలు తమ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలని లేదా లవ్ స్టోరీతో ఘర్షణను నివారించడానికి విడుదల తేదీని వాయిదా వేయాలని మేం ఇప్పుడు అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే OTT రిలీజ్ లు ఆదాయాలు సృష్టించే థియేటర్లలోకి కూడా విడుద‌ల చేయొచ్చు.. అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కార్యదర్శి సునీల్ నారంగ్ అన్నారు.

తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ప్రసంగాన్ని చూపిస్తూ థియేటర్లు బతికితేనే నిర్మాతలు మనుగడ సాగిస్తారని టీఎఫ్‌సిసి ప్ర‌తినిధులు పేర్కొన్నారు. థియేటర్లలో సినిమాలు చూడటం మన సంస్కృతి అని నాని పేర్కొన్నారు. కానీ టక్ జగదీష్‌ను OTT ప్లాట్ ఫామ్ పై విడుదల చేయాలనే తన నిర్మాతల నిర్ణయాన్ని ఆయన ఇప్పుడు వినయంగా అంగీకరిస్తున్నారు. హీరోయిజం ఆర్భాటం థియేటర్లలో మాత్రమే కనిపిస్తుంది OTT లలో కాదు అని ఖండించారు.

అయితే కొన‌సాగుతున్న ఈ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ట‌క్ జ‌గదీష్ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ సంస్థ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో క్ష‌మాప‌ణ‌లు కోరింది. రెండున్న‌రేళ్ల క్రిత‌మే సినిమా ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ వాయిదా ప‌డింది. క‌ష్టంలో ఉన్నాం. అందుకే ఇప్పుడు ఓటీటీ బాట‌లో వెళుతున్నామ‌ని నిర్మాత‌లు తెలిపారు. తాము ముందే హీరో నాని అనుమ‌తి తీసుకున్నాం. ఆయ‌న థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఆగ‌మ‌ని కోరారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితిని క్రైసిస్ వ‌ల్ల న‌ష్టాన్ని వివ‌రించి అభ్య‌ర్థించ‌గా స‌రేన‌న్నారు! అంటూ నానీని డిపెండ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు ఈ నోట్ లో. అలాగే ద‌ర్శ‌కుడిని కూడా ఒప్పించాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న కూడా థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఆగాల‌ని అన్నార‌ని షైన్ స్క్రీన్స్ సంస్థ తెలిపింది. ఓవ‌రాల్ గా నాని ట‌క్ జ‌గ‌దీష్ సెప్టెంబ‌ర్ 10న ఓటీటీలో విడుద‌లైపోతోంది.
Tags:    

Similar News