డార్లింగ్ ప్రభాస్ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా అది క్యూరియాసిటీ పెంచేదే. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైన్స్ పిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ K' భారతీయ సినీపరిశ్రమలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పని చేస్తున్న కాస్టింగ్ కానీ టెక్నాలజీ కానీ హై ఎండ్ లో భారీ బడ్జెట్లతో కూడుకున్నది అన్నది విధితమే.
తాజా సమాచారం మేరకు.. ప్రాజెక్ట్ K చిత్రం షూటింగ్ కోసం ప్రత్యేక సాంకేతికతను టీమ్ ఉపయోగిస్తోంది. ఈ చిత్రం DIY Arri Alexa టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించిన మొదటి భారతీయ చిత్రం ఇదే. ఈ సాంకేతికత సినిమాటోగ్రఫీకి సంబంధించినది.
ఇది చిత్రానికి దృశ్యమాన అనుభవాన్ని (విజువల్ ఎక్స్ పీరియెన్స్) మెరుగుపరుస్తుంది. ప్రాజెక్ట్ K అనేది భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సాధ్యమైనంత ఉత్తమమైన అవుట్ పుట్ ను అందించడానికి మేకర్స్ ప్రపంచ స్థాయి సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు.
ఫైట్స్ - కాస్ట్యూమ్స్- భారీ సెట్లు ఇలా ప్రతిదీ ఖరీదైనవే. విజువల్ గ్రాఫిక్స్ మాయాజాలం పరంగానూ హాలీవుడ్ స్టాండార్డ్స్ ని అనుసరిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ ఆరంభమే ప్రకటించారు. అందుకు తగ్గట్టు భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ తనకు ఎంతో స్పెషల్ యూనిక్ అని దీపిక పదుకొనే తెలిపింది. నాగ్ అశ్విన్ యూనిక్ థాట్ ని కూడా ప్రశంసించింది. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ 3డి- సలార్ కూడా విజువల్ మాయాజాలంతో కట్టిపడేసేవే. అయితే వాటన్నిటి కంటే రిచ్ గా అసాధారణ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతోంది.