ప్రాజెక్ట్ కే : అప్పుడు కాస్టింగ్ కాల్.. ఇప్పుడు స్టంట్స్ క్రూ కాల్
మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ సినిమా ఒక పాన్ ఇండియా సినిమా గా కాకుండా అంతర్జాతీయ స్థాయి సినిమా గా ఆయన ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ హీరోగా దీపిక పదుకునే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ మెగాస్టార్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం కొన్ని నెలల క్రితం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న నటీ నటులు సంప్రదించండి అంటూ చాలా మంది కొత్త వారిని ఈ సినిమా కోసం ఆ సమయంలో ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు స్టంట్స్ క్రూ కావాలి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కాల్ ఇచ్చింది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం ఉన్న వారి కోసం అన్వేషణ మొదలయ్యింది.
యాక్షన్ కొరియోగ్రఫీ తెలిసి.. మార్షల్ ఆర్ట్స్ పై అవగాహణ ఉన్న వారు.. కలరి ఫైటర్స్.. ఇంకా ఇతర యాక్షన్ ఫార్మట్ ల్లో ప్రావిణ్యం ఉన్న వారికి ప్రాముఖ్యత ఇవ్వబడును అంటూ నాగ్ అశ్విన్ ప్రకటించాడు. సినిమాలోని ఒక భారీ యాక్షన్ సన్నివేశం కోసం వందల కొద్ది ఫైటర్స్ అవసరం అవ్వడం వల్లే ఇలా కాస్టింగ్ కాల్ ఇచ్చారు అనే సమాచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతోంది.
ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ ల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కథ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. ఫాంటసీ వరల్డ్ లోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లి తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పదుల కొద్ది సెట్టింగ్స్ వేశారు.
ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరుపబోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు దీపిక పదుకునే అభిమానులు మరియు అమితాబచ్చన్ అభిమానులు ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా ఈ సినిమాను నాగ్ అశ్విన్ హాలీవుడ్ టెక్నాలజీతో.. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నాడు.
వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కనీసం ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందా.. టీజర్ వస్తుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా తో పాటు సలార్ మరియు స్పిరిట్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.