మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈమద్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాలు ఇతర భాషల్లో రీ మేక్ అవ్వడం లేదా డబ్ అవ్వడం జరుగుతోంది. దాంతో అన్ని భాషల ప్రేక్షకులకు పృథ్వీరాజ్ సుకుమారన్ సుపరిచితుడు అయ్యాడు. ఆయన ప్రస్తుతం హిందీలో కూడా సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈయన వెబ్ సిరీస్ చేసేందుకు కూడా సిద్దం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిస్కట్ కింగ్ గా పృథ్వీరాజ్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త రాజన్ పిల్లై జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ తో పథ్వీరాజ్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కు పృథ్వీ రాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హిందీలో రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ ను సౌత్ లో అన్ని భాషల్లో కూడా డబ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు ఆయనే దర్శకత్వం వహిస్తూ ప్రథాన పాత్రలో కూడా తానే నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాజన్ పిల్లై బ్రిటానియా కంపెనీలో ప్రథాన వాటాదారుడిగా ఉన్నాడు. బిస్కట్ కింగ్ గా పేరు దక్కించుకున్న రాజన్ పిల్లై ఆర్థిక పరమైన లావాదేవీల అక్రమాలకు సంబంధించి పోలీసులు ఆయన్ను 1995 లో అరెస్ట్ చేయడం జరిగింది.
పోలీసులు అరెస్ట్ చేసిన కొన్నాళ్లకే అనారోగ్యం తో రాజన్ పిల్లై కన్నుమూశాడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాడు. ఆయన జీవితం మొత్తం కూడా చాలా స్పెషల్ గా సాగిందని ఆయన మద్దతు దారులు అంటూ ఉంటారు. ఆయన వ్యాపార సామ్రాజ్యంను విస్తరించిన తీరు ఎంతో మందికి ఆదర్శం. అందుకే ఆయన కథను వెబ్ సిరీస్ గా తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది. ప్రముఖ స్టార్ నటీ నటులు ఈ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా ఈ ప్రాజెక్ట్ ను పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం పృథ్వీ రాజ్ ఈ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా అరడజను సినిమాల్లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వెబ్ సిరీస్ కు బిస్కట్ కింగ్ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని తెలుస్తోంది.