PS 1 బ్యూటీ.. ట్రెడిషినల్ లుక్ లోనే స్టన్నింగ్

Update: 2022-10-03 08:18 GMT
సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకోకపోయినప్పటికి కూడా వారి టాలెంట్ తో మాత్రం సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇక మలయాళం సినిమాలతో మొదట మంచి గుర్తింపును అందుకున్న ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు తమిళ్ లో కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటుంది. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్గా కూడా మరోసారి ఐశ్వర్య లక్ష్మి తన గ్లామర్ తో సరికొత్తగా కట్టుకుంది.

ఐశ్వర్య లక్ష్మి ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది అనే విధంగా ఇండస్ట్రీలో ఒక మంచి రిపెక్ట్ అయితే అందుకుంది. ఆమెతో సినిమాలు చేసేందుకు ప్రముఖ దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ఇటీవల వచ్చిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పాన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు అయితే లభించింది.

అందులో ఆమె చూపించిన హావభావాలకు రివ్యూలు కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. మరోసారి ఐశ్వర్య లక్ష్మి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక ఈ బ్యూటీ మరో స్థాయికి వెళ్లే విధంగా గ్లామర్ షో తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అందరి తరహాలో బికినీలో కనిపించకుండా ట్రెడిషనల్ లుక్ లోనే ఆమె తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

రీసెంట్ గా అమ్మడు అందమైన చీరలో కాస్త ఘాటుగా కనిపించే ప్రయత్నం చేసింది. ఇక ఆమె చూపించిన హావభావాలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి అంటూ నటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం ప్రాజెక్టుల విషయానికి వస్తే చివరగా ఆమె తెలుగులో అయితే గాడ్సే అనే సినిమాలో నటించింది.

అంతకు ముందు కొన్ని తెలుగు సినిమాలు చేసింది కానీ అవి ఏమీ అంతగా గుర్తింపు అందించలేదు. ఇక ఆ తర్వాత తమిళ్ మలయాళం అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి భాష నుంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక ప్రస్తుతం అయితే మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. తెలుగులో కూడా అమ్మూ అనే మరొక సినిమా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు మరో రెండు మళయాలం ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News