తెలుగులో రూపొందిన బాహుబలి సినిమాని... ఆ సినిమా కలెక్షన్స్‌ను బద్దలు కొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తమిళ సినీ పరిశ్రమ నుంచి తెరమీదకు వచ్చిన ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పబడే ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం గత ఏడాది విడుదలైంది. ఇక రెండో భాగం కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కార్తి, జయం రవి, త్రిష, విక్రమ్, ఐశ్వర్యరాయ్ వంటి వారు కీలక పాత్రలో నటించారు. పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినా.. తమిళ ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. సుమారు 400 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి... తమిళ బాహుబలిగా నిలబడే ప్రయత్నం చేసింది. తెలుగు వెర్షన్‌లో కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేసుకున్నారు.
కానీ ఎందుకో ఆ మేర అంచనాలను రాబట్ట లేకపోయింది. అయితే గతంలో జరిగిన తప్పును ఈసారి సరిదిద్దుకునేందుకు ఒక నెలపాటు సినిమాని ప్రమోట్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించి ఏప్రిల్ నెల మొత్తం ప్రమోషన్స్ చేయాలని సినిమా యూనిట్ భావించింది. అందుకు నెల రోజులకు సంబంధించి కాల్ సీట్లు కావాలని ఆ నెల మొత్తం ప్రమోషన్స్ మాత్రమే చేస్తామని నటీ నటులకు, ఇతర కీలక టెక్నీషియన్లకు సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. మార్చి ఒకటో తేదీన టీజర్‌తో ప్రారంభించి... ఈ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది.
కచ్చితంగా గతంలో తెలుగు ప్రేక్షకులను ఎక్కడెక్కడ మిస్సయ్యాము... అక్కడ ఖచ్చితంగా వాళ్ళందరి అటెన్షన్ గ్రాఫ్ చేసే విధంగా ఈసారి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా తమిళుల హిస్టరీ మీద తెలుగు వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతో... ఈసారి ఆ హిస్టరీ మీద కూడా కాస్త అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా టీం నుంచి కొన్ని వీడియోలు చేయబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.