తమిళ క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు అందించాలని ఎంతో కాలంగా ఎదురుచూశారు. ఇక మొత్తానికి మొదటి భాగంకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా అంతకుమించి అనేలా తీసుకురాబోతున్నారు. మొదటి భాగంలో కేవలం పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చూపించారు.
మళ్లీ చోళులు తిరిగి రాబోతున్నారు అంటూ ఇప్పుడు మరొక అద్భుతమైన టీజర్ తో ఆసక్తిని కలిగించారు. అదేవిధంగా అఫీషియల్ డేట్ కూడా ప్రకటించేశారు. చోళుల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చారిత్రాత్మక కథపై తమిళంలో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే మిగతా భాషల్లో అక్కడక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ ముఖ్యమైన పాత్రలో నటించగా ఐశ్వర్యారాయ్ త్రిష వంటి వారు కూడా కీలకమైన పాత్రలో నటించారు.
ఇక సెకండ్ పార్ట్ కు సంబంధించిన అఫీషియల్ టీజర్ ను విడుదల చేసిన టీం అందులో చోళులు మళ్ళీ రాబోతున్నారు అంట క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ టీజర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
రాజ్యాల కు సంబంధించిన కీలకమైన అంశాలను ఇప్పుడు రెండవ భాగంలో చూపించబోతున్నారు. అంతే కాకుండా మొదటి పార్ట్ కంటే రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయట. PS 2 ను 2023 ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 500 కోట్లు అందుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో గట్టిగా నమ్ముతోంది. అయితే ఫస్ట్ పార్ట్ మాత్రం తమిళంలో తప్పితే మిగతా భాషలో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ను ఎలాంటి హైప్ తో రిలీజ్ చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
మళ్లీ చోళులు తిరిగి రాబోతున్నారు అంటూ ఇప్పుడు మరొక అద్భుతమైన టీజర్ తో ఆసక్తిని కలిగించారు. అదేవిధంగా అఫీషియల్ డేట్ కూడా ప్రకటించేశారు. చోళుల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చారిత్రాత్మక కథపై తమిళంలో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే మిగతా భాషల్లో అక్కడక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ ముఖ్యమైన పాత్రలో నటించగా ఐశ్వర్యారాయ్ త్రిష వంటి వారు కూడా కీలకమైన పాత్రలో నటించారు.
ఇక సెకండ్ పార్ట్ కు సంబంధించిన అఫీషియల్ టీజర్ ను విడుదల చేసిన టీం అందులో చోళులు మళ్ళీ రాబోతున్నారు అంట క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ టీజర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
రాజ్యాల కు సంబంధించిన కీలకమైన అంశాలను ఇప్పుడు రెండవ భాగంలో చూపించబోతున్నారు. అంతే కాకుండా మొదటి పార్ట్ కంటే రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయట. PS 2 ను 2023 ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 500 కోట్లు అందుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో గట్టిగా నమ్ముతోంది. అయితే ఫస్ట్ పార్ట్ మాత్రం తమిళంలో తప్పితే మిగతా భాషలో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ను ఎలాంటి హైప్ తో రిలీజ్ చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.