పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూటర్న్ ప్రస్తుతం పొలిటికల్ కారిడార్ సహా సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు ప్రారంభించేస్తూ కాల్షీట్లను కేటాయించేయడం షాక్ నిస్తోంది. ఇప్పటికే పింక్ రీమేక్ జెట్ స్పీడ్ తో తెరకెక్కుతోంది. ఇటీవలే లాయర్ సాబ్ ని సెట్స్ కు తీసుకెళ్లిన పవన్ తొలి షెడ్యూల్ పూర్తిచేశారు. తొలిగా అన్నఫూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. పవన్ ఈ సినిమాకు కేవలం 28 రోజులే షూటింగ్ డేస్ ని కేటాయించడంతో యూనిట్ మెరుపు వేగంతో పనుల్ని పూర్తి చేస్తున్నారు. ఇక జనవరి 29న సైలెంట్ గా క్రిష్ పిరియాడిక్ డ్రామాని కూడా పవన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఎలాంటి హడావుడి లేకుండా మొదలైన ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ కి పవన్ షెడ్యూల్ కేటాయించినట్లు తాజా సమాచారం. నేటి (బుధవారం) నుంచి పది రోజులు పాటు ఏకధాటిగా క్రిష్ సినిమా షూటింగ్ కు పవన్ హాజరు కానున్నారు. పవన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముందుగా ఆయనపై సన్నివేశాలు పూర్తిచేయనున్నారుట. దీనికి సంబంధించి మిగతా ఆర్టిస్టులందరిని సిద్ధంగా ఉండమని చెప్పారు. హైదరాబాద్ కొండాపూర్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లో పవన్ పై చిత్రీకరణ జరగనుంది.
ఇక పవన్ విజయవాడలో జరిగే రాజకీయ సమావేశాల కోసం ప్రత్యేకంగా చార్టర్ ప్లైట్ ను చిత్ర నిర్మాతలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ లు ఉన్నప్పుడు హైదరాబాద్ లో....లేనప్పుడు విజయవాడలో పార్టీ ఆఫీస్ లో నేతలతో సమావేశం కానున్నారు. అత్యవసర సమయంలో హుటాహుటీన రాజకీయ సమావేశాలకు హాజరవ్వాలనుకున్నప్పుడు చార్టర్ ప్లైట్ ను వినియోగించనున్నారు. ఇలా ఈ రెండు సినిమా షూటింగ్ లను ..అటు జనసైనానిగా రాజకీయాల్లోనూ ఈ కొద్ది రోజులు రెండు పడవల ప్రయాణం చేయనున్నారని తెలుస్తోంది.